News


మరో విడత రేటు కోతకు చాన్స్‌!

Tuesday 17th December 2019
news_main1576555047.png-30266

  • ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ సంకేతాలు
  • మందగమనాన్ని పసిగట్టే రేట్లు తగ్గిస్తూ వచ్చామని వెల్లడి
  • వేచిచూసే ధోరణే డిసెంబర్లో పెంచకపోవటానికి కారణం
  • ఎన్‌పీఏల సమస్య పరిష్కారమవుతుందని స్పష్టీకరణ

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మరో విడత రెపో రేటు తగ్గిస్తామనే సంకేతాలిచ్చారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 5.15 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో మందగమన ధోరణిని ఆర్‌బీఐ 2019 ఫిబ్రవరిలోనే గుర్తించిందని, దీన్ని నివారించే లక్ష్యంతోనే అప్పటి నుంచీ వరుసగా ఐదు ద్వైమాసిక సమావేశాల్లో రెపో రేటును తగ్గిస్తూ వచ్చామని చెప్పారాయన. ఈ కాలంలో 135 బేసిస్‌ పాయింట్ల రెపో (1.35 శాతం) తగ్గించడాన్ని ప్రస్తావించారు. ఈ నెల్లో పెంచకపోవటాన్ని ప్రస్తావిస్తూ... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, వేచిచూసే ధోరణికి మారామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ఈ విషయాలు చెప్పారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూస్తే...

  • బ్యాంకులు, బ్యా‍‍ంకులు కాని ఆర్థిక సంస్థలు, కంపెనీలు తమ బ్యాలెన్స్‌ షీట్లను సరిచేసుకునే ప్రక్రియలో ఉన్నాయి. మొండిబకాయిల సమస్య పరిష్కారానికి సంబంధించిన దిశలో ఇది ఒక కీలక అడుగు. తదుపరి ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చే అంశం.
  • భారత్‌లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వృద్ధి మందగించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయ కార్యాచరణ ప్రణాళిక కొరవడటం కూడా ఇందుకు కారణమే. పదేళ్లక్రితం ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో ఈ తరహా సమన్వయ కార్యాచరణ చర్యలున్నాయి. ఆర్థిక వృద్ధి లక్ష్యంగా విధానపరమైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవాలి. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఒప్పందం సానుకూల అంశం. 
  • మౌలిక రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులు పెరగటం కీలకం. అలాగే తయారీ రంగం మీద కూడా దృష్టి పెట్టాలి. అయితే గత పాలసీ ముందు ఆర్‌బీఐ 1,539 తయారీ కంపెనీలపై ఒక సర్వే నిర్వహించింది. ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పునరుజ్జీవానికి సంబంధించి కొంత సానుకూలత కనబడుతోంది.
  • ఎస్సార్‌ స్టీల్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. మొండిబకాయిల పరిష్కారం విషయంలో ఈ తీర్పు ఒక స్పష్టత నిచ్చింది. భవిష్యత్తులో బ్యాంకులకు ఉపకరిస్తుంది. 



You may be interested

అనిల్ అంబానీ కేసులో చైనా బ్యాంకులకు చుక్కెదురు

Tuesday 17th December 2019

680 మిలియన్ డాలర్ల క్లెయిమ్‌కు బ్రిటన్ హైకోర్టు నో న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) తీసుకున్న 680 మిలియన్ డాలర్ల కార్పొరేట్ రుణాలకు పూచీకత్తు వివాదంలో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీకి ఊరట లభించింది. ఈ రుణాలను అనిల్ అంబానీ చెల్లించాలంటూ చైనా బ్యాంకులు వేసిన క్లెయిమ్ దరఖాస్తును బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి తాను పూచీకత్తునిచ్చినట్లు తగిన సాక్ష్యాధారాలేమీ లేవని, పూర్తి విచారణ జరగకుండా చైనా బ్యాంకులు తనను ఒత్తిడి

పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 17th December 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో మంగళవారం భారత్‌ స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 140 పాయింట్ల లాభంతో 41,052 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,082 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category