News


మరో విడత రేట్ల తగ్గింపునకు అవకాశం

Monday 2nd December 2019
news_main1575258097.png-29992

  • ఈ నెల 5న ఆర్‌బీఐ ఎంపీసీ ప్రకటన

న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ త్రైమాసికంలో మరింతగా క్షీణించి 4.5 శాతానికి పరిమితం అయిన నేపథ్యంలో.. ఆర్‌బీఐ ఎంపీసీ మరో విడత పావు శాతం వరకు కీలక రేట్ల తగ్గింపును చేపట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. శక్తికాంతదాస్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ ఇప్పటి వరకు ప్రతీ భేటీలోనూ ఎంతో కొంత రేట్లను తగ్గిస్తూనే వచ్చింది. ఇప్పటి వరకు గత ఏడాది కాలంలో 135 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. దేశ వృద్ధి రేటును ప్రగతి బాట పట్టించేందుకు తాము మద్దతుగా నిలుస్తామని ఆయన ప్రకటించారు కూడా. అయితే, ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం ఆర్‌బీఐ రేట్ల కోతకు సాయపడింది. మరి తాజాగా ద్రవ్యోల్బణం ఎగువవైపు పరుగును ఆరంభించింది. అక్టోబర్‌ నెలకు ఆర్‌బీఐ లక్ష్యిత స్థాయి (4.5 శాతం)ని దాటుకుని 4.6 శాతానికి చేరింది. దీంతో మరో విడత రేట్లపై కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. అయితే, అక్టోబర్‌లో రేట్ల కోత సమయంలో సర్దుబాటు ధోరణిని ఆర్‌బీఐ కొనసాగించినందున, ఆర్థిక పరిస్థితులు ఇలానే బలహీనంగా ఉంటే మరో విడత రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ముఖ్య ఆర్థికవేత్త రాజీవ్‌ బిశ్వాస్‌ తెలిపారు. ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ ఈ నెల 3న ప్రారంభం కానుంది. 5న విధాన ప్రకటనపై నిర్ణయం వెలువడుతుంది. 



You may be interested

టెలికాం షేర్ల బూస్ట్‌...గ్యాప్‌అప్‌ ప్రారంభం

Monday 2nd December 2019

టెలికాం కంపెనీలు టారీఫ్‌లను భారీగా పెంచిన నేపథ్యంలో ఆ షేర్లు సోమవారం నాటి ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీ గ్యాప్‌అప్‌తో మొదలుకావడంతో స్టాక్‌ సూచీలు సైతం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 280 పాయింట్ల మేర పెరిగి 41,130 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 12,135 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే బ్యాంకింగ్‌, ఆటో, ఐటీ రంగాల షేర్ల క్షీణతతో ట్రేడింగ్‌ మొదలైన కొద్ది నిముషాల్లోనే సూచీలు నష్టాల్లోకి

మనీ మార్కెట్‌ ఫండ్‌ అంటే ఏమిటి ?

Monday 2nd December 2019

ప్ర: నేను గత కొంత కాలంగా ఎల్‌ అండ్‌ టీ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌(గతంలో ఎల్‌ అండ్‌ టీ ఇండియా ప్రుడెన్స్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇది మంచి ఫండేనా ? ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా? మనీ మార్కెట్‌ ఫండ్‌ అంటే ఏమిటి ? దీంట్లో ఎవరైనా ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?  అరుణ్‌, హైదరాబాద్‌ జ: ఎల్‌ అండ్‌ టీ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ మంచి పనితీరునే కనబరుస్తోంది. అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌

Most from this category