News


ఇకపై రోజంతా నెఫ్ట్ సేవలు ..

Thursday 8th August 2019
news_main1565241700.png-27626

  • డిసెంబర్‌ నుంచి అమల్లోకి

ముంబై: ఆన్‌లైన్‌ నగదు బదిలీ లావాదేవీలకు సంబంధించిన నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్‌) విధానాన్ని ఇకపై ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి దీన్ని అమల్లోకి తేనున్నట్లు వెల్లడించింది. దేశీయంగా రిటైల్ చెల్లింపుల వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని పేమెంట్ సిస్టమ్ విజన్ 2021 పత్రంలో ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా నగదు బదిలీ లావాదేవీలకు నెఫ్ట్‌, అంతకు మించిన మొత్తానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టం (ఆర్‌టీజీఎస్‌) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. రెండో, నాలుగో శనివారం మినహా ప్రస్తుతం నెఫ్ట్‌ సర్వీసులు ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 7 గం.ల దాకా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ విధానాల్లో నగదు బదిలీలపై తాను విధించే చార్జీలను ఎత్తివేసింది. ఈ ప్రయోజనాలను ఖాతాదారులకు బదలాయించాలంటూ బ్యాంకులను కూడా ఆదేశించింది. మరోవైపు, ఏటీఎం చార్జీలు, ఫీజులన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సీఈవో సారథ్యంలో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 



You may be interested

ఎస్‌బీఐ...15 బేసిస్‌ పాయింట్ల కోత

Thursday 8th August 2019

ఆర్‌బీఐ రెపో తగ్గింపు నేపథ్యంలో- బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన రుణ రేటును (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత- ఎంసీఎల్‌ఆర్‌)ను 15 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) వరకూ తగ్గించింది. అన్ని కాలపరిమితలపై 0.15 శాతం రేటు తగ్గినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. వాహన, గృహ, వ్యక్తిగత రుణాలకు ప్రామాణికంగా ఉన్న ఏడాది కాలవ్యవధి రుణ రేటు తాజా

లాభాల్లో ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు..

Thursday 8th August 2019

ఆర్‌బీఐ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించడంతో గురువారం ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.34 సమయానికి, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.35 శాతం పెరిగి 2,592.85 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) 2.65 శాతం, బ్యాంక్‌ ఇండియా 2.32 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.15 శాతం, కెనరా బ్యాంక్‌ 1.44 శాతం, ఎస్‌బీఐ 1.03 శాతం,

Most from this category