News


యథాతథ రేట్ల కొనసాగింపు: ఆర్‌బీఐ

Thursday 6th February 2020
Markets_main1580971789.png-31563

ప్రస్తుత 5.15 శాతం వద్దే రెపో రేటు అమలు
వచ్చే ఏడాది జీడీపీ 6 శాతం వృద్ధి అంచనా

మూడో రోజులపాటు సమావేశాలు నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మరోసారి యథాతథ విధానాల అమలుకే కట్టుబడింది. వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.15 శాతం వద్దనే కొనసాగనుంది. దీంతో రివర్స్‌ రెపో రేటు సైతం​4.9 శాతంగా కొనసాగనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌  గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన ఎంపీసీ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను చేపట్టింది. దీనిలో భాగంగా యథాతథ పాలసీ అమలుకు ఆరుగురు సభ్యులూ ఏకగ్రీవంగా ఓటు వేసినట్లు తెలియజేసింది. ఇంతక్రితం పాలసీ సమీక్షలోనూ ఆర్‌బీఐ యథాతథ విధానాల అమలుకే మొగ్గు చూపిన విషయం విదితమే. ఆర్థిక వృద్ధికి వీలుగా అవసరమైతే భవిష్యత్‌లో రేట్ల కోత చేపట్టే వీలున్నట్లు ఈ సందర్భంగా ఆర్‌బీఐ సంకేతాలిచ్చింది. డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం లక్ష్యానికంటే ఎగువకు చేరిందని తెలియజేసింది. ప్రస్తుతం ధరల విషయంలో అనిశ్చితి కొనసాగుతున్నట్లు పేర్కొంది. అయితే ఉల్లిపాయల ధరలు దిగిరావడంతో భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం మందగించే అవకాశమున్నట్లు అంచనా వేసింది. 

6 శాతం జీడీపీ 
వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6 శాతం పుంజుకోగలదని ఆర్‌బీఐ తాజాగా అంచనా వేసింది. తొలి అర్దభాగానికి 5.5-6 శాతం వృద్ధిని ఊహిస్తోంది. కాగా.. ఈ ఏడాది క్యూ4(జనవరి-మార్చి)లో రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 6.5 శాతానికి చేరవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో ఇది 5-5.4 శాతంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. ఈ జనవరిలో సీపీఐ ఆరేళ్ల గరిష్టమైన 7.35 శాతానికి ఎగసిన విషయం విదితమే. గతేడాది వరుస కోతల ద్వారా రెపో రేటును దశాబ్ద కనిష్టం 5.15 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. 



You may be interested

ఆర్‌బీఐ ఎఫెక్ట్‌: బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం జంప్‌

Thursday 6th February 2020

అందరూ ఊహించనట్లుగానే కీలక వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథ పాలసీకే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడంతో గురువారం మిడ్‌సెషన్‌ అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు అనుహ్య మద్దతు లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌  470పాయింట్లు(1.51శాతం) లాభపడింది. నేడు ఆర్‌బీ పాలసీ ప్రకటన నిర్ణయం వెలువడునున్న నేపథ్యంలో మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు స్తబ్దుగా ట్రేడ్‌ అయ్యాయి. వడ్డీరేట్లపై

ఐటీఐ షేర్‌ అప్‌ 8%

Thursday 6th February 2020

 ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన పొందేందుకు ఇష్యూ జారీకి ఐటీఐ రెండుస్లార్లు  విధించిన గడువు తేదీ పొడిగించిన ఐటీఐ.. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను పేర్కొంటూ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ)ను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఐటీఐ షేరు 7.89 శాతం పెరిగి 90.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category