News


ఇక దేశంలో బ్యాంక్‌ ఆఫ్‌ చైనా

Friday 2nd August 2019
news_main1564725240.png-27493

  • ఆర్‌బీఐ అనుమతి

ముంబై: దేశంలో మామూలు బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభించడానికి బ్యాంక్‌ ఆఫ్‌ చైనాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ తరహాలోనే దేశంలో బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు వీలు కలుగుతుంది. ఆర్‌బీఐ నిబంధనలకు కట్టుబడి పనిచేసే బ్యాంకుల జాబితా ఆర్‌బీఐ యాక్ట్‌, 1934 రెండవ షెడ్యూల్‌లో ఉంటుంది. ఈ రెండవ షెడ్యూల్‌లో ‘బ్యాంక్‌ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌’ పేరును కూడా చేర్చడం జరిగిందని సెంట్రల్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కూడా...
జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ను కూడా రెండవ షెడ్యూల్‌లో చేర్చినట్లు మరో నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ పేర్కొంది.



You may be interested

భారత్‌లో డిమాండ్‌ ‘‘బంగారం‘‘

Friday 2nd August 2019

క్యూ2లో 13 శాతం పెరుగుదల 213 టన్నులుగా నమోదు ఆకర్షణీయ ధరలు, పర్వదినాలతో  పెరిగిన కొనుగోళ్లు ఆర్‌బీఐకి కూడా పసిడి ఆకర్షణ వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక ముంబై: బంగారానికి ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో (క్యూ2) దేశంలో మంచి డిమాండ్‌ నమోదయ్యింది. 2018 ఇదే కాలంతో పోల్చితే డిమాండ్‌ 13 శాతం పెరిగి 213 టన్నులకు చేరింది. సంబంధిత మూడు నెలల్లో పర్వదినాలు, అలాగే ఆకర్షణీయమైన ధరలు పసిడి కొనుగోళ్లను పెంచినట్లు వరల్డ్‌ గోల్డ్‌ ‍కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తన తాజా

నష్టాల మార్కెట్లో..పాజిటివ్‌గా ఎయిర్‌టెల్‌

Friday 2nd August 2019

 ఈ ఏడాది జూన్‌ త్రైమాసిక ఫలితాలలో భారతీ ఎయిర్‌టెల్‌ నష్టం, అంచనాల కంటే అధికంగా నమోదయినప్పటికి సగటు వినియోగదారుని ఖర్చు(ఏపీఆర్‌యు) రూ.105(గత ఏడాది ఇదే త్రైమాసికంలో) నుంచి రూ. 129 కి పెరగడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు పాజిటివ్‌గా కదులుతోంది. మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికి ఈ కంపెనీ షేరు మాత్రం ఉదయం 10.55 సమయానికి 3.32 శాతం పెరిగి రూ.334.65 వద్ద ట్రేడవుతోంది.  ఎయిర్‌టెల్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలు:

Most from this category