News


డ్యూక్స్‌ ‘బటర్‌ ఫ్లేవర్డ్‌’ వాఫీ

Tuesday 30th April 2019
news_main1556603325.png-25428

రవి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తాజాగా ‘బటర్‌ ఫ్లేవర్డ్‌’ వాఫీ ని  మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ క్రీమీ, క్రంచ్‌ వాఫీ వినియోగదారులకు కొత్త ఫ్లేవర్‌తో మంచి అనుభూతిని ఇస్తుందని కంపెనీ తెలిపింది. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవిందర్‌ అగర్వాల్‌ ఆలోచనలకు అనుగుణంగా వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త ఫ్లేవర్‌లను ఆవిష్కరించడానికి రవి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డ్యూక్స్‌ ముందుంటుందని పేర్కొంది.  చాకొలెట్స్‌, వాఫీలు, కుకీస్‌, బిస్కెట్లసహా పలు ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. ‘‘క్రీమీ వాఫర్‌ విభాగం మార్కెట్‌లో రవి ఫుడ్స్‌ వాటా దాదాపు రూ.45,000 కోట్లు. ఏడాదికి 10 శాతం నుంచి 12 శాతం వృద్ధి నమోదుచేసుకుంటోందని ఎండీ అగర్వాల్‌ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. 



You may be interested

ట్రెంట్‌ లాభం 37 శాతం అప్‌

Tuesday 30th April 2019

ఒక్కో షేర్‌కు రూ.1.30 డివిడెండ్‌ న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ రిటైల్‌ సంస్థ, ట్రెంట్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.16 కోట్లకు పెరిగిందని ట్రెంట్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.539 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.677 కోట్లకు పెరిగిందని

అప్పులన్నీ తీర్చేస్తా !

Tuesday 30th April 2019

మరోసారి ట్విటీ చేసిన విజయ్‌ మాల్యా  లండన్‌: కింగ్‌ ఫిషర్‌ విమానయాన సంస్థకు చెందిన అప్పు‍లన్నింటినీ తీర్చేస్తానని విజయ్‌ మాల్యా మరోసారి పేర్కొన్నారు. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు చెల్లించాల్సిన కింగ్‌ ఫిషర్‌ కంపెనీ బకాయిలన్నింటినీ వంద శాతం పూర్తిగా చెల్లిస్తానని విజయ్‌ మాల్యా ట్విటర్‌ ద్వారా ఆఫర్‌ ఇచ్చారు. కింగ్‌షిఫర్‌ ఎయిర్‌లైన్స్‌తో సహా పలు విమానయాన సంస్థలు మునిగిపోయాయని పేర్కొన్నారు. పూర్తిగా వ్యాపార వైఫల్యం వల్లే కింగ్‌ ఫిషర్‌ మూతపడిందని,

Most from this category