News


రేటు తగ్గింపు వరుసలో మరో మూడు బ్యాంకులు

Wednesday 11th December 2019
news_main1576035764.png-30166

  • యూబీఐ, బీఓబీ, యుకో బ్యాంకుల నిర్ణయం

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సోమవారం రేటు తగ్గించిన నేపథ్యంలో... ఇదే బాటలో మంగళవారం మరో మూడు బ్యాంకులు చేరాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) యుకో బ్యాంకులు తమ నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను స్వల్పంగా తగ్గించాయి. 

  • యూబీఐ విషయంలో రేటు తగ్గింపు 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల శ్రేణిలో ఉంది. బుధవారం నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది.  
  • మంగళవారం నుంచీ అమల్లోకి వచ్చే విధంగా.. యుకో బ్యాంక్‌ అన్ని రుణ కాలపరిమితులపై ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించింది. -  
  • ఇక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వివిధ కాలపరిమితి రుణ రేట్లను 20 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించింది. 12వ తేదీ నుంచీ తగ్గించిన రేట్లు అందుబాటులో ఉంటాయి. -
  • ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు కూడా ఇప్పటికే రేట్ల కోత​ నిర్ణయం తీసుకున్నాయి.



You may be interested

స్వల్ప లాభాలతో ప్రారంభం

Wednesday 11th December 2019

ట్రేడ్‌ డీల్‌ కుదరనిపక్షంలో డిసెంబర్‌ 15 నుంచి చైనా దిగుమతులపై టారీఫ్‌ పెంపును అమెరికా వాయిదా వేయవచ్చన్న వార్తలతో బుధవారం ఆసియా మార్కెట్లు స్థిరంగా ట్రేడవుతున్న నేపథ్యంలో భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 45 పాయింట్ల లాభంతో 40,285 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10 పాయింట్ల పెరుగుదలతో 11,867 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

డిసెంబర్15 దాకా పోర్టబిలిటీ నిలిపివేత

Wednesday 11th December 2019

ఈ నెల 16 నుంచి కొత్త ఎంఎన్‌పీ నిబంధనలు న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ప్రక్రియకు సంబంధించి కొత్త నిబంధనలు డిసెంబర్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థకు మారే క్రమంలో డిసెంబర్‌ 10 నుంచి 15 దాకా ఎంఎన్‌పీ సదుపాయం అందుబాటులో ఉండదని, ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (యూపీసీ) కూడా జనరేట్ కాదని పేర్కొంది.

Most from this category