News


యస్‌ బ్యాంకు నుంచి రజత్ మోంగా నిష్క్రమణ

Friday 4th October 2019
news_main1570161709.png-28708

ముంబై: మొండిబాకీలు తదితర సమస్యల్లో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌ సీనియర్‌ గ్రూప్ ప్రెసిడెంట్‌, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ రజత్ మోంగా రాజీనామా చేశారు. ఇన్వెస్టర్లు, విశ్లేషకులతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్‌లో బ్యాంకు సీఈవో రవ్‌నీత్ గిల్‌ ఈ విషయం వెల్లడించారు. గడిచిన రెండేళ్లుగా బాధ్యతల భారం, ఒత్తిడి పెరిగిపోవడంతో ఆయన కొంతకాలం పాటు సెలవు తీసుకునే అంశం కూడా చర్చించినప్పటికీ, వైదొలగేందుకే మోంగా మొగ్గుచూపారని గిల్ చెప్పారు.  వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో రాణా కపూర్‌ స్థానంలో మోంగా బాధ్యతలు చేపట్టవచ్చన్న వార్తలు కూడా గతంలో వచ్చాయి. మరోవైపు, షేరు భారీ పతనాలపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు గిల్‌ ప్రయత్నాలు కొనసాగించారు. సంస్థ నిర్వహణ పనితీరు పటిష్టంగా ఉందని, కంపెనీ నిర్వహణకు సంబంధించి షేరు ధర ప్రామాణికం కాబోదని గిల్ తెలిపారు.



You may be interested

70.86 వద్ద ప్రారంభమైన రూపీ

Friday 4th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో 28 పైసలు బలపడి 70.86 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు అమ్మకాల ఒత్తిడిలో ఉండడంతో పాటు, విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగడంతో రూపీ డాలర్‌ మారకంలో 20 పైసలు బలహీనడి 71.08 వద్ద ముగిసింది. రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో 70.86 వద్ద ప్రారంభమవ్వగా, 70.77 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు

బీపీసీఎల్‌కు రేటింగ్ డౌన్‌గ్రేడ్ ముప్పు

Friday 4th October 2019

ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై మూడీస్‌ వ్యాఖ్యలు ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)ను ప్రైవేటీకరించిన పక్షంలో రేటింగ్‌ను తగ్గించే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ హెచ్చరించింది. ప్రస్తుతం సార్వభౌమ రేటింగ్ స్థాయిలో ఉన్న ట్రిపుల్‌ బి మైనస్‌ స్థాయిని బీఏ1 స్థాయికి తగ్గించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రైవేటీకరణతో బీపీసీఎల్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధం తెగిపోయి.. బాండ్ల ఉపసంహరణ కోసం ఒత్తిడి పెరుగుతుందని,

Most from this category