News


యస్‌ బ్యాంక్‌లో 2 శాతం వాటా విక్రయించిన మోర్గాన్‌ క్రెడిట్స్‌

Friday 20th September 2019
news_main1568954075.png-28444

  • ఆర్‌నామ్‌ ఎన్‌సీడీల చెల్లింపుల కోసం

న్యూఢిల్లీ: యస్‌ బ్యాంక్‌లో ప్రమోటర్‌ సంస్థ, మోర్గాన్‌ క్రెడిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎమ్‌సీపీఎల్‌) 2.3 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఎన్‌సీడీలకు ముందుగానే చెల్లింపులు జరపడానికి, మరోవైపు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం యస్‌బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా తగ్గించుకునే ​క్రమంలో భాగంగా మోర్గాన్‌ క్రెడిట్స్‌ ఈ షేర్లను విక్రయించింది. యస్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓ రాణా కపూర్‌కు చెందని ముగ్గురు కూతుళ్లు ఈ ఎమ్‌సీపీఎల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వాటా విక్రయంతో రాణా కపూర్‌ కుటుంబం వాటా యస్‌ బ్యాంక్‌లో 7.4 శాతానికి తగ్గుతుంది. యస్‌ బ్యాంక్‌ 2004 నుంచి కార్యకలాపాలు నిర్వహించడం మొదలు పెట్టిందని, గత 15 ఏళ్లలో మంచి వృద్ధిని సాధించామని రాణా కపూర్‌ తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ, అడ్డంకులను అధిగమిస్తూ, వృద్ధి పయనాన్ని యస్‌ బ్యాంక్‌ కొనసాగించగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 
మోర్గాన్‌ క్రెడిట్స్‌ కంపెనీ 2018 ఏప్రిల్‌లో రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఆర్‌నామ్‌)కి నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీ)జారీ చేసి రూ.1,160 కోట్లు సమీకరించింది. ఈ బాండ్లు 2021, ఏప్రిల్‌లో మెచ్యూర్‌ అవుతాయి. ఈ బాండ్ల ద్వారా సమీకరించిన  నిధులను స్టార్టప్‌ బిజినెస్‌ల కోసం మోర్గాన్‌ క్రెడిట్స్‌ వినియోగించింది. ఈ బాండ్లకు సంబంధించి ముందస్తుగా చెల్లించాల్సిన(వడ్డీతో కలుపుకొని) మొత్తం ఇప్పటిదాకా రూ.722 కోట్లుగా ఉంది. యస్‌బ్యాంక్‌లో విక్రయించిన వాటా ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆర్‌నామ్‌ ఎన్‌సీడీలకు చెల్లింపులు జరపడానికి  మోర్గాన్‌ క్రెడిట్స్‌ ఉపయోగించనున్నది. 



You may be interested

మధ్యప్రాచ్య అనిశ్చితి..పెరిగిన చమురు

Friday 20th September 2019

సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరిగాక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్‌లో చమురు లాభపడి ట్రేడవుతోంది. ఉదయం 9.37 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.54 శాతం పెరిగి బారెల్‌ 63.67 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.88 శాతం పెరిగి 58.70 వద్ద ట్రేడవుతున్నాయి. సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన డ్రోన్‌ దాడికి ఇరాన్‌ కారణంగా చూపుతూ, అమెరికా, మధ్యప్రాచ్యంలో సౌదీ నేతృత్వంలో యూరోపియన్‌ దేశాలతో

71.20 వద్ద ప్రారంభమైన రూపీ

Friday 20th September 2019

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో 12 పైసలు బలపడి 71.20 వద్ద శుక్రవారం ప్రారంభమైంది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో పాటు, విదేశి నిధుల ఔట్‌ఫ్లో కొనసాగడం, చమురు ధరలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో బలహీనపడి 71.32 వద్ద ముగిసింది. గత సెషన్‌లో డాలర్‌-రూపీ సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ ఎన్‌ఎస్‌ఈలో 71.38 వద్ద ఉండగా, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 7.12 శాతం తగ్గిందని ఐసీఐసీఐ

Most from this category