News


రామ్‌కో సిమెంట్‌ భారీ విస్తరణ

Friday 30th August 2019
news_main1567143173.png-28105

  • రూ.4,000 కోట్ల పెట్టుబడి
  • కంపెనీ ఈడీ బాలాజీ మూర్తి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- సిమెంటు తయారీ సంస్థ రామ్‌కో సిమెంట్స్‌ భారీ విస్తరణ చేపట్టింది. ఇందుకోసం రూ.4,000 కోట్లు వ్యయం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 3.15 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో సిమెంటు ఉత్పత్తి కేంద్రాన్ని రూ.1,500 కోట్లతో నెలకొల్పుతోంది. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని రామ్‌కో మార్కెటింగ్‌ ఈడీ బాలాజీ కె మూర్తి గురువారం వెల్లడించారు. సూపర్‌క్రీట్‌ సిమెంట్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మార్కెటింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.రామకృష్ణన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో 1.5 మిలియన్‌ టన్నుల క్లింకర్‌ యూనిట్‌, విశాఖపట్నం జిల్లాలో 1 మిలియన్‌ టన్నుల గ్రైండింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒడిషాలోని సిమెంటు తయారీ ప్లాంటులో 1.5 మిలియన్‌ టన్నులు, కోల్‌కతాలో 1 మిలియన్‌ టన్నుల సామర్థ్యం జోడిస్తున్నట్టు పేర్కొన్నారు. 
వచ్చే ఏడాది చివరికల్లా..
కంపెనీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు 2020 డిసెంబరుకల్లా పూర్తి కానున్నాయి. కర్నూలు ప్లాంటు రాకతో ఆంధ్రప్రదేశ్‌లో రామ్‌కో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్‌ టన్నులు నమోదు కానుంది. తద్వారా ఏపీలో అత్యధిక ఉత్పత్తి సామర్థ్యమున్న సంస్థగా నిలుస్తుంది. అన్ని తయారీ కేంద్రాలు కలిపి ప్రస్తుతం సంస్థ వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 12.5 మిలియన్‌ టన్నులు ఉంది. విస్తరణ పూర్తి అయితే ఇది 20 మిలియన్‌ టన్నులకు చేరుతుందని బాలాజీ వెల్లడించారు. 2018-19లో కంపెనీ టర్నోవరు రూ.5,146 కోట్లు. 2020-21లో ఇది రూ.7,500 కోట్లను తాకుతుందన్నారు. 
సుస్థిర ప్రభుత్వం ఉంటే..
‘ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. మీరేమో విస్తరణ చేపడుతున్నారు. ఫలితం ఎలా ఉండబోతోంది’ అని మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు బాలాజీ స్పందిస్తూ.. ‘ఏ రాష్ట్రంలోనైనా ఒడిదుడుకులు తాత్కాలికం. మళ్లీ మార్కెట్‌ పుంజుకుంటుందన్న నమ్మకం మాకుంది. సుస్థిర ప్రభుత్వం ఉన్నప్పుడు సిమెంటుకు డిమాండ్‌ ఉంటుంది. మా పెట్టుబడులు కొనసాగిస్తాం’ అని స్పష్టం చేశారు. మందగమన ప్రభావం సిమెంటు రంగంపై ఉందా అన్న మరో ప్రశ్నకు వ్యక్తిగత గృహాల నిర్మాణాలు అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులు సాగుతున్నాయని చెప్పారు. సిమెంటు వినియోగం దేశంలో ఏప్రిల్‌-జూన్‌ కాలంలో 7-8 శాతం వృద్ధి నమోదైందన్నారు. You may be interested

వచ్చేస్తోంది కొత్త ఐఫోన్‌

Friday 30th August 2019

 వచ్చే నెల 10న ఆవిష్కరణ శాన్‌ ఫ్రాన్సిస్కో: త్వరలో కొత్త ఐఫోన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుందన్న వార్తలకు ఊతమిస్తూ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెల 10న సిలికాన్ వేలీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఇన్విటేషన్లు పంపింది. సాధారణంగా ఏటా క్రిస్మస్‌ షాపింగ్ సీజన్‌కు ముందు.. ఇలాంటి కార్యక్రమంలోనే యాపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ వస్తోంది. దానికి అనుగుణంగానే ఈసారీ సెప్టెంబర్ 10న జరిగే కార్యక్రమంలో 'ఐఫోన్‌

సింగల్‌ బ్రాండ్‌ బాజా..!

Friday 30th August 2019

స్టోర్స్‌ ఏర్పాటుకు యాపిల్‌ తదితర దిగ్గజాల ఆసక్తి రిటైల్‌ నిబంధనల సడలింపుతో ఊతం ముందుగా ఆన్‌లైన్‌ అమ్మకాలు తర్వాత ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ ఏర్పాటు     సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ రంగంలో ఇప్పటిదాకా ప్రతిబంధకంగా ఉన్న పలు నిబంధనలను కేంద్రం సడలించడంతో భారత్‌లో సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్న విదేశీ దిగ్గజ సంస్థల ప్రణాళికలకు ఊతం లభించినట్లయింది. దీంతో టెక్‌ దిగ్గజం యాపిల్‌ సహా పలు సంస్థలు భారత్‌లో సింగిల్‌ బ్రాండ్‌ విక్రయాలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం దేశీ

Most from this category