News


ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల్లో రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా!?

Tuesday 28th January 2020
news_main1580184044.png-31256

ఆప్‌టెక్‌ షేర్ల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడారన్న ఆరోపణలకుగాను బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలాపై సెబి డేగకన్ను వేసింది. ఈ వ్యవహారంలో ఆప్‌టెక్‌ బోర్డుమెంబర్లైన రమేశ్‌ దమానీ, మధు జయకుమార్‌ తదితరుల పాత్రపై కూడా సెబి పరిశీలన జరపనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రశ్నించేందుకు ఈ నెల 24న రాకేశ్‌ను ఆయన భార్య రేఖను, సోదరుడు రాజేశ్‌ కుమార్‌ను, అత్త సుశీలాదేవీ గుప్తాను సెబి పిలిపించిందని ఎకనమిక్‌ టైమ్స్‌ తెలిపింది. అంతకుముందు రోజు రాకేశ్‌ సోదరి సుధా గుప్తాను సెబి ప్రశ్నించిందని తెలిపింది. 2016 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో జరిగిన ట్రేడ్‌ అవకతవకలపై సెబి పరిశీలన జరుపుతోందని, ఈ ట్రేడ్స్‌కు ఇన్‌సైడర్‌ సమాచారం ఆధారం కావచ్చన్న అనుమానాలున్నాయని మింట్‌ నివేదిక తెలిపింది. ప్రజలకు వివరాలు తెలియకముందే కొందరికి కంపెనీ లోగుట్టు వ్యవహార వివరాలను రహస్యంగా అందించి తద్వారా వారు ట్రేడ్‌లో లబ్ది పొందేలా చేయడాన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు. ప్రస్తుతం రాకేశ్‌కు ఆప్‌టెక్‌లో 24.24 శాతం వాటా ఉంది. ఈ వాటా విలువ దాదాపు రూ. 160 కోట్లు. ఆరోపణల నేపథ్యంలో ఆప్‌టెక్‌ షేరు మంగళవారం దాదాపు 2.5 శాతం నష్టపోయి 169 రూపాయల వద్ద ట్రేడవుతోంది. తాజా వార్తలపై స్పందించేందుకు రాకేశ్‌, ఆయన భార్య నిరాకరించారు. 



You may be interested

నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లోకి...

Tuesday 28th January 2020

కరోనా వైరస్‌ కారణంగా ఈ కొత్త ఏడాదిలో రెండో రెండో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన దేశీయ మంగళవారం స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 54 పాయింట్ల నష్టంతో 41,101 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 12100 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నప్పటికీ.., నిన్నటి రోజున మార్కెట్‌ భారీ పతనం నేపథ్యంలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పాల్పడంతో సూచీలు తిరికి లాభాల్లోకి మళ్లాయి.  దీనికి

క్యూ3 ఎఫెక్ట్‌- హెచ్‌డీఎఫ్‌సీ ప్లస్‌లో

Tuesday 28th January 2020

1.5 శాతం బలపడిన షేరు 4 రెట్లు పెరిగిన నికర లాభం  మార్టిగేజ్‌ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక​సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం 4 రెట్లు జంప్‌చేసి రూ. 8,372 కోట్లను తాకింది. బంధన్‌ బ్యాంక్‌కు గృహ ఫైనాన్స్‌ విక్రయం నేపథ్యంలో రూ. 9020 కోట్లమేర అదనపు లాభం​ఆర్జించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. మొత్తం ఆదాయం సైతం 92 శాతం ఎగసి

Most from this category