News


ఈ నెల 29న ఇండిగో ఈజీఎమ్‌

Saturday 4th January 2020
news_main1578112665.png-30668

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ, ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ కంపెనీ  ఈజీఎమ్‌(అసాధారణ సమావేశం) ఈ నెల 29న జరగనున్నది. ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్‌ గంగ్వాల్‌ అభ్యర్థన మేరకు ఈ ఏజీఎమ్‌ జరుగుతోంది. కంపెనీ షేర్ల బదిలీ, టేకోవర్‌, సంబంధించి ‘రైట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ రెఫ్యూజల్‌’, ‘ట్యాగ్‌ ఎలాంగ్‌ రైట్‌’ తదితర  అంశాలను తొలగించడానికి  ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌(ఏఓఏ)లో సవరణ కోసం ఈ ఈజీఎమ్‌ను ఉద్దేశించారు. 
ఇండిగో కంపెనీలో నిర్వహణ పరంగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్‌ గంగ్వాల్‌ ఆరు నెలల క్రితం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సెబీ జోక్యం చేసుకోవాలని గంగ్వాల్‌ కోరారు. దీంతో మరో ప్రమోటర్‌అయిన రాహుల్‌ భాటియాతో వివాదాలు చెలరేగాయి. రాకేశ్‌ గంగ్వాల్‌ గ్రూప్‌నకు 36.64 శాతం వాటా ఉండగా, రాహుల్‌ భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటా ఉంది. 

కంపెనీకి మంచిదే....
ఏఓఏ నుంచి కొన్ని అంశాలను(మూడు క్లాజులను) తొలగించడం, దానికి ఆమోదం పొందడం కంపెనీకి మంచిదేనని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఈ మూడు క్లాజుల తొలగింపు వల్ల ప్రమోటర్లు ఇరువురికి సమాన హక్కులు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్లాజుల తొలగింపునకు ఆమోదం లభించకపోతే, ప్రమోటర్ల పోరు మరికొంత కాలం కొనసాగుతుందని, అది షేర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. 
 



You may be interested

నిఫ్టీలో బేరిష్‌ క్యాండిల్‌!

Saturday 4th January 2020

ఇరాన్‌ సంఘటనలతో దేశీయ మార్కెట్లు శుక్రవారం బేర్స్‌ పట్టులోకి జారాయి. చమురు ధర ఒక్కమారుగా పెరగడంతో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. నిఫ్టీ 12250 పాయింట్ల దిగువకు వచ్చింది. ఇంట్రాడేలో నిఫ్టీ బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరిచింది. ఒకదశలో నిఫ్టీ కీలక 12191 పాయింట్ల వరకు దిగజారింది. చివర్లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త కోలుకుంది. అయితే తాజా క్యాండిల్‌ ఏర్పడడం తప్ప చార్టుల్లో ఎలాంటి ఫార్మేషన్లు ఏర్పడలేదని, సంఘటన వార్తల

ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం వాటా విక్రయం: ఎస్‌బీఐ

Saturday 4th January 2020

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)లో 1.01 శాతం వాటాను ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)విక్రయించనున్నది. మూలధన నిధుల సమీకరణలో భాగంగా 1.01 శాతం వాటాకు సమానమైన 50 లక్షల షేర్లను విక్రయించనున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ షేర్లను విక్రయిస్తామని తెలిపింది. నిర్దేశిత ఫార్మాట్‌లో కనీసం పది లక్షల షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుందని, ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15 వ

Most from this category