News


వ్యక్తిగత దివాలా నియంత్రణ దశలవారీగా...

Tuesday 30th July 2019
news_main1564465586.png-27404

  • దివాలా కంపెనీలను కొన్న వాటిపై క్రిమినల్‌ చర్యలు ఉండవు
  • కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌
  • ఐబీసీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ: మూడేళ్ల నాటి ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) చట్టంలో ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించగా, ఇందుకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిర్వహణ అవసరాలకు రుణాలిచ్చిన సంస్థల (అపరేషనల్‌ క్రెడిటార్స్‌)తో పోలిస్తే, సెక్యూర్డ్‌ రుణాలిచ్చిన వాటికి ప్రాధాన్యంపై తాజా సవరణలతో స్పష్టత రానుంది. దివాలా కంపెనీని ఒడ్డెక్కించేందుకు దాన్ని కొనుగోలు చేసిన వారిపై ఎటువంటి క్రిమినల్‌ చర్యలు ఉండవని, అలాగే పరిష్కార ప్రణాళిక అమలు అనంతరం పన్నులు చెల్లించాలంటూ వారికి వ్యతిరేకంగా ఆదేశాలు కూడా జారీ చేయబోమని ‍ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టత ఇచ్చారు. రుణాలు ఎగ్గొట్టిన కంపెనీలకు సంబంధించిన వ్యక్తులపై మాత్రం క్రిమినల్‌ చర్యలు కొనసాగుతాయన్నారు. వ్యక్తులకు సంబంధించిన దివాలా నియంత్రణ చట్టాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. ఐబీసీ చట్ట ఉద్దేశ్యాలను నీరుగార్చే చర్యలకు స్పందనగా తాజా సవరణలు తీసుకొచ్చినట్టు బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఎస్సార్‌ స్టీల్‌ దివాలా కేసులో వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని పంపిణీ చేసే విషయంలో రుణదాతలు, ఆపరేషనల్‌ క్రెడిటార్స్‌ను ఒకే విధంగా ఎన్‌సీఎల్‌టీ పరిగణించడాన్ని మంత్రి ఉదాహరణగా పేర్కొన్నారు. రుణ చెల్లింపుల్లో విఫలమైన కంపెనీని వేలం వేయడం ద్వారా వచ్చే మొత్తం పంపిణీపై రుణదాతల కమిటీకే అధికారం కల్పించడం, ఐబీసీ కింద ప్రతిపాదించే కేసుల పరిష్కారానికి 330 రోజుల గడువుతో సత్వర పరిష్కారానికి వీలు కల్పించడం ఈ సవరణల ఉద్దేశ్యాలుగా మంత్రి తెలిపారు. 



You may be interested

ఇదంతా ప్రభుత్వం నిర్వాకమే..

Tuesday 30th July 2019

డిమాండ్‌, ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి వాటికి ఊతమిచ్చేందుకు కేంద్రం చర్యలేమీ తీసుకోవడం లేదు  బజాజ్ ఆటో చైర్మన్‌ రాహుల్ బజాజ్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్‌, ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై బజాజ్ ఆటో చైర్మన్‌ రాహుల్ బజాజ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెట్టుబడులు, డిమాండ్‌కి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఏ విధంగానూ ప్రయత్నించడం లేదని ఆక్షేపించారు. "ప్రభుత్వం చెప్పినా చెప్పకున్నా.. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు గణాంకాలు

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్ల కోత

Tuesday 30th July 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ కాలపరిమితులపై డిపాజిట్‌ రేట్లను తగ్గించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు (ప్రస్తుతం 5.75 శాతం) తగ్గింపు వంటి అంశాలు దీనికి నేపథ్యం. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్‌బీఐ వరుసగా మూడుసార్లు మొత్తం 75 బేసిస్‌ పాయింట్లు (ముప్పావుశాతం)

Most from this category