News


ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ ఎన్‌పీఏల ప్రక్షాళన చేపట్టాలి

Friday 1st November 2019
news_main1572579992.png-29273

  • బలమైన వృద్ధికి ఇది అవసరం
  • ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రక్షాళన వేగంగా ముగించాలి
  • ఆర్‌బీఐ పూర్వపు గవర్నర్‌ రాజన్‌ సూచన
  • బీజేపీ హయాంలోనే తన పదవీ కాలం ఎక్కువని ప్రకటన

న్యూఢిల్లీ: రానున్న కాలంలో పటిష్టమైన వృద్ధి కోసం ప్రభుత్వరంగ బ్యాంకుల మాదిరే ఎన్‌బీఎఫ్‌సీ రంగంలోనూ ఎన్‌పీఏల ప్రక్షాళన అవసరమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. లేదంటే ఆర్థిక రంగానికి భారంగా మారుతుందన్నారు. తన పదవీ కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిల (ఎన్‌పీఏలు) ప్రక్షాళన ఆరంభం కాగా, అది ఇంకా కొనసాగుతూనే ఉందని, దీన్ని వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు రాజన్‌. 5 శాతం జీడీపీ వృద్ధి రేటుతో భారత్‌ గణనీయ స్థాయిలో ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోంటోందంటూ, వృద్ధిని వేగవంతం చేసేందుకు కొత్త తరహా సంస్కరణలు అవసరమన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ల హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి దారుణంగా మారిందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల చేసిన విమర్శలపై... ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా రాజన్‌ స్పందించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా తన పదవీ కాలంలో మూడింట రెండొంతులు బీజేపీ ప్రభుత్వ పాలనలోనే కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘పూర్వపు ప్రభుత్వం(యూపీఏ)లో కేవలం ఎనిమిది నెలలే పనిచేశాను. బీజేపీ ప్రభుత్వ హయాంలో 26 నెలలు పనిచేశాను. నా పదవీ కాలంలో ఎక్కువ భాగం ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే  కొనసాగింది’’ అంటూ  పేర్కొన్నారు. 2013 సెప్టెంబర్‌ 5 నుంచి 2016 సెప్టెంబర్‌ వరకు రాజన్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశారు.రాజన్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో, యూపీఏ హయంలో ఫోన్‌ కాల్స్‌ ఆధారంగానే రుణాలు మంజూరు చేశారంటూ నిర్మలా సీతారామన్‌ ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం గుర్తుండే ఉంటుంది. 
పునరావృతం కాకుండా చర్యలు
బ్యాంకుల్లో వారసత్వంగా ఉన్న సమస్యలను ప్రక్షాళన చేయడంతోపాటు పాలనను మెరుగుపరచడం ద్వారా భవిష్యత్తులో తిరిగి చోటు చేసుకోకుండా చూడాల్సిన అవసరం ఉందని రాజన్‌ అన్నారు. ఆ పని మొదలైందని, మళ్లీ ఇటువంటివి జరగకుండా ఈ పనిని వేగవంతం చేయాలని సూచించారు. 5 శాతం వృద్ధి రేటు అన్నది దారుణమేనని, ఈ విషయంలో ఏదైనా తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే ఈ స్థాయి వృద్ధి రేటుతో ఉద్యోగాల కల్పన సాధ్యం కాదన్నారు. ‘‘భారత్‌కు చాలా బలమైన వృద్ధి అవసరం. మరో నూతన తరహా సంస్కరణల అవసరం ఉంది. ప్రభుత్వానికి రాజకీయంగా పూర్తి బలం ఉండడం మంచిది కాగా, ఇప్పటి వరకు ఏమీ చేయకపోవడం విచారకరం’’ అని రాజన్‌ వ్యాఖ్యానించారు.  You may be interested

ఐఓసీ లాభం 83 శాతం డౌన్‌

Friday 1st November 2019

తగ్గిన జీఆర్‌ఎమ్‌ రూ.1,807 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ(ఐఓసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 83 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.3,247 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.564 కోట్లకు తగ్గిందని ఐఓసీ తెలిపింది. రిఫైనరీ మార్జిన్లు తగ్గడం, ఇన్వెంటరీ నష్టాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని కంపెనీ చైర్మన్‌

ఆ టెల్కోలకు ప్యాకేజీలు అక్కర్లేదు

Friday 1st November 2019

అవి బాకీలు కట్టగలిగే స్థితిలోనే ఉన్నాయి టెలికం మంత్రికి జియో లేఖ న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ స్థాయిలో లైసెన్సు ఫీజులు బాకీలు కట్టాల్సి రానున్న పాత తరం టెల్కోలు .. ప్రభుత్వాన్ని బెయిలవుట్ ప్యాకేజీ కోరుతుండటంపై రిలయన్స్ జియో మండిపడింది. ఆ రెండు సంస్థలు (భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా) ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయని, ప్రజల సొమ్ముతో వాటికి ప్యాకేజీలేమీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా మూడు

Most from this category