News


ఖతార్‌ సావరిన్‌ ఫండ్‌కు అదానీ ఎలక్ట్రిసిటీలో వాటా

Thursday 12th December 2019
news_main1576122575.png-30184

  • డీల్‌ విలువ రూ.3,200 కోట్లు 

న్యూఢిల్లీ: అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌లో 25.1 శాతం వాటాను ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ(క్యూఐఏ) కొనుగోలు చేయనున్నది. ఈ డీల్‌ విలువ రూ.3,200 కోట్లు. ఈ మేరకు ఖతార్‌కు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌, ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీతో నిశ్చయాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ ట్రాన్సిమిషన్‌ తెలిపింది. అదానీ ట్రాన్సిమిషన్‌ కంపెనీకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై సంస్థ(ఏఈఎమ్‌ఎల్‌), ముంబైలో 400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్తును పంపిణి చేస్తోంది. 



You may be interested

రుణాల విభాగంలోకి రియల్‌మీ

Thursday 12th December 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చైనాలోని షెన్‌జెన్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీ... డిజిటల్‌ రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెలాఖరు నుంచి మన దేశంలో రుణ సేవలను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి వచ్చే వారం న్యూఢిల్లీలో ఒక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే దేశంలోని ప్రధాన బ్యాంక్‌లు, ప్రైవేట్‌ ఆర్థిక సంస్థలతో ఈ మేరకు సంస్థ ఒప్పందం చేసుకుంది. 18 ఏళ్లు పైబడిన

దేశీ మార్కెట్లోకి అమెజాన్ ఫైర్ ‍టీవీలు

Thursday 12th December 2019

 ఒనిడాతో ఒప్పందం ధర రూ. 12,999-రూ. 21,999 న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా తమ ఫైర్‌ టీవీ బ్రాండ్ స్మార్ట్ టీవీలను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఒనిడా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 32 అంగుళాల ఒనిడా ఫైర్‌ టీవీ స్మార్ట్ టీవీ ధర రూ.12,999 కాగా, 43 అంగుళాల టీవీ ధర రూ.21,999. డిసెంబర్ 20 నుంచి అమెజాన్‌డాట్‌ఇన్ పోర్టల్‌లో వీటి విక్రయం ప్రారంభమవుతుంది. ఈ ఫుల్ హెచ్‌డీ టీవీల్లో బిల్టిన్‌

Most from this category