News


క్యు3లో లాభాలు పెరగొచ్చు!

Monday 6th January 2020
news_main1578295419.png-30703

కంపెనీల ఫలితాలపై అంచనాలు
నిఫ్టీ 50 కంపెనీల లాభాలు మూడో త్రైమాసికంలో పెరగవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే బేస్‌ తగ్గడం, కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గడం, కొన్ని బ్యాంకులు, విత్త కంపెనీలు మంచి ప్రదర్శన చూపడం, మొండిపద్దుల కేటాయింపులు తగ్గడం.. క్యు3లో పాజిటివ్‌ ప్రభావం చూపుతాయంటున్నారు. డౌన్‌గ్రేడింగ్‌ల సీజన్‌ ముగిసిందని భావిస్తున్నా, వెనువెంటనే అప్‌గ్రేడ్స్‌ ఆరంభం కావని అభిప్రాయపడ్డారు. ఈటీ సర్వేలో నిఫ్టీ 50 కంపెనీ నికర లాభం ఈ త్రైమాసికంలో 55.2 శాతానికి చేరవచ్చని, ఇది 9 త్రైమాసికాల గరిష్ఠమని నిపుణులు అంచనా వేశారు. 
రంగాల వారీగా అంచనాలు..
1. ఆటో మొబైల్స్‌: విక్రయాల్లో ఒత్తిళ్లు కొనసాగవచ్చు. కాస్తో కూస్తో పెరిగిన విక్రయాలను పెరిగిన డిస్కౌంట్లు, ప్రమోషన్లు దెబ్బతీస్తాయి. అందువల్ల రెవెన్యూపై నెగిటివ్‌ భారం ఉండొచ్చు. కానీ కార్పొరేట్‌ టాక్స్‌ కోతతో లాభాల్లో వృద్ధి ఉండవచ్చు. 
2. బీఎఫ్‌ఎస్‌ఐ: కొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల మొండి బకాయిల వృద్ది నెమ్మదించవచ్చు. ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంకుల అధిక లాభాల వృద్ది నమోదు చేస్తాయని అంచనా. ఎస్‌బీఐ కొత్త స్లిపేజ్‌లు చూపవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌లు మంచి మెరుగుదల చూపుతాయి. 
3. క్యాపిటల్‌ గూడ్స్‌: ప్రభుత్వ వ్యయాలు నెమ్మదించడం కంపెనీల ఆర్డర్‌ యాక్టివిటీని మందగింపజేస్తుంది. ఎల్‌అండ్‌టీ పేర్కొనే ఆర్డర్‌ గ్రోత్‌ గైడెన్స్‌ను మార్కెట్‌ వర్గాలు నిశితంగా పరిశీలిస్తాయి. 
4. సిమెంట్‌: సిమెంట్‌ధరలు పెరగడంతో కంపెనీలు రికార్డు రెవెన్యూ వృద్ధి నమోదు చేయవచ్చు. పెట్‌కోక్‌ ధరలు దిగిరావడంతో కంపెనీల ఎర్నింగ్స్‌ గ్రోత్‌ 85-96 శాతం పెరగవచ్చు. బడా కంపెనీల ఫలితాలు మరింత బాగుంటాయని అంచనా.
5. ఐటీ: డాలర్‌ రెవెన్యూలో 1.5- 3శాతం వృద్ది ఉండొచ్చు. ఇతర కంపెనీల కన్నా విప్రో, టెక్‌మహీంద్రా మంచి లాభాలు చూపవచ్చు. మేనేజ్‌మెంట్‌ చేసే కామెంటరీపై దృష్టి పెట్టాలి.
6. ఎఫ్‌ఎంసీజీ: అల్ప విక్రయ వాల్యూంల కారణంగా రెవెన్యూ మందగించినా, కార్పొరేట్‌ టాక్స్‌ కటింగ్‌తో లాభాలు బాగుంటాయి. రూరల్‌ డిమాండ్‌లో క్షీణత కారణంగా పండుగ డిమాండ్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. 
7. మెటల్స్‌: క్యు3లో మెటల్‌ కంపెనీలు బలమైన ఫలితాలు ప్రకటించవచ్చు. దేశీయ స్టీల్‌ ధరలు పెరగడం, ముడిపదార్ధాల ధరలు దిగిరావడం కలిసివస్తాయి. స్టీల్‌తో పాటు అల్యూమినియం కంపెనీలు కూడా పాజిటివ్‌గా ఉండవచ్చు. జింక్‌ మాత్రం స్తబ్దుగా ఉంటుందని అంచనా.
8. ఫార్మా: యూఎస్‌ జనరిక్‌ మార్కెట్లో ప్రైసింగ్‌ ఒత్తిడులు, యూఎస్‌ఎఫ్‌డీఏ నిబంధనలు, దేశీయ మార్కెట్లో ధరల నియంత్రణా ఇబ్బందులు.. కంపెనీలపై నెగిటివ్‌ ప్రభావం చూపవచ్చు. వ్యయనియంత్రణలు, ఆర్‌అండ్‌డీ వ్యయాల తగ్గింపు, అల్పమార్జిన్‌ఉత్పత్తుల నుంచి వైదొలగడం లాంటివి మార్జిన్‌ వృద్ధికి దోహదపడతాయని అంచనా.You may be interested

మార్కెట్‌ డౌన్‌- ఈ స్టాక్స్‌ హైజం‍ప్‌

Monday 6th January 2020

రికార్డ్‌ గరిష్టానికి చేరువలో ఐఈఎక్స్‌ వాహన విక్రయాల ’ఫోర్స్‌’ మోటార్స్‌ మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో మధ్యాహ్నం 12.10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 650 పాయింట్లు పతనమైంది. 41,815కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 200 పాయింట్లు దిగజారి 12,027 వద్ద ట్రేడవుతోంది. అయితే విభిన్న వార్తల కారణంగా పతన మార్కెట్లోనూ రెండు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి.

మార్కెట్‌ భారీ పతనానికి కారణాలివే..!

Monday 6th January 2020

ఇరాన్‌ అమెరికాల భౌగోళికల ఉద్రిక్తతలు మరింత ఉధృతం కావడంతో సోమవారం ఉదయం సెషన్‌లోనే దేశీయ స్టాక్‌మార్కెట్లో భారీగా అమ్మకాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు 2శాతానికి పైగా పెరిగి 70డాలర్లకు చేరుకోవడం కూడా కూడా విక్రయాలకు మద్దతునిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 541 పాయింట్లు నష్టపోయి 41వేల మార్కు దిగువన 40,923 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో నిప్టీ సూచీ 164 పాయింట్లు పతనమైన 12100 స్థాయిని కోల్పోయి 12,062.85

Most from this category