News


తగ్గిన  యూకో బ్యాంక్‌ నష్టాలు

Friday 8th November 2019
news_main1573184937.png-29428

-గత క్యూ2లో రూ.1,136 కోట్ల నష్టాలు 
-ఈ క్యూ2లో నష్టాలు రూ.892 కోట్లు 
-ఒకింత తగ్గిన మొండి బకాయిలు 

న్యూఢిల్లీ: 
ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌లో కొంచెం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,136 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.892 కోట్లకు తగ్గాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే నష్టాలు పెరిగాయి. ఈ బ్యాంక్‌కు ఈ క్యూ1లో రూ.601 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.3,749 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,534 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.., 
అధ్వాన స్థితిలోనే రుణ నాణ్యత..
బ్యాంక​ రుణ నాణ్యత అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. గత క్యూ2లో రూ.29,581 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.25,665 కోట్లకు తగ్గాయి. నికర మొండి బకాయిలు రూ.11,820 కోట్ల నుంచి రూ.7,238 కోట్లకు చేరాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 25.37 శాతం నుంచి 21.87 శాతానికి, నికర మొండి బకాయిలు 11.97 శాతం నుంచి 7.32 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ2లో రూ.1,643 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ2లో రూ.2,099 కోట్లకు పెరిగాయి. కేంద్రానికి ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ ద్వారా రూ.2,130 కోట్ల పెట్టుబడులు సమీకరించింది. 

నష్టాలు తగ్గడంతో బీఎస్‌ఈలో యూకో బ్యాంక్‌ షేర్‌ 3.6 శాతం లాభంతో రూ.14.23 వద్ద ముగిసింది. 



You may be interested

సన్‌ ఫార్మా లాభం రూ.1,064 కోట్లు

Friday 8th November 2019

గత క్యూ2లో రూ.270 కోట్ల నష్టాలు రూ.8,123 కోట్లకు పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ1,064 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.270 కోట్ల నికర నష్టాలు వచ్చాయని సన్‌ఫార్మా తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.6,938 కోట్ల నుంచి రూ.8,123 కోట్లకు ఎగసిందని పేర్కొంది.  స్పెషాల్టీ వ్యాపారంలో పురోగతి... వ్యయాల ఆదా, సామర్థ్యాల మెరుగుదలపై దృష్టి సారించడం

క్యాషే .. కింగ్‌..

Friday 8th November 2019

 నగదు లావాదేవీలకే పెద్ద పీట మళ్లీ కరెన్సీ నోట్లను భారీగా దాచుకుంటున్న జనం మరోవంక డిజిటల్‌ లావాదేవీల్లోనూ భారీ వృద్ధి ఆర్థిక వ్యవస్థకూ అప్పటి సైడ్‌ ఎఫెక్ట్స్ నోట్ల రద్దుకు మూడేళ్లు పెద్దనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు. అప్పట్లో పెద్దనోట్లంటే 1,000... 500 మాత్రమే. ఇప్పుడు 2000 లాంటి పేద్ద నోటు కూడా వచ్చేసింది లెండి!!. కాకపోతే మోదీ సర్కారు వాటిని రద్దు చేయటానికి చెప్పిన ప్రధాన కారణాలు రెండే!. ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం.

Most from this category