News


30% పెరిగిన హెచ్‌పీసీఎల్‌ నికర లాభం

Thursday 7th November 2019
news_main1573123805.png-29422

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌(హెచ్‌పీసీఎల్‌) నికరలాభం, సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో త్రైమాసిక ప్రాతిపదికన 29.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ ఇది విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. జూన్‌క్వార్టర్‌లో రూ. 811 కోట్లుగా నమోదైన కంపెనీ లాభం, సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 1,052.3 కోట్లకు పెరిగింది.  కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 14.3 శాతం పడిపోయి రూ. 60,862 కోట్లుగా నమోదైంది. స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ బారెల్‌కు 2.60 డాలర్లుగా నమోదైంది. ఇది విశ్లేషకులు అంచనావేసిన బారెల్‌కు 4.40 డాలర్ల కంటే తక్కువ కావడం గమనార్హం. ఎబిటా త్రైమాసిక ప్రాతిపదికన 41.1 శాతం పెరిగి రూ. 2,319 కోట్లుగా నమోదైంది. అదేవిధంగా ఎబిటా మార్జిన్‌ 150 బేసిస్‌ పాయింట్లు పెరిగి 3.8 శాతానికి పెరిగింది. కాగా సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 1,447 కోట్లుగా, ఆదాయం రూ. 64,974 కోట్లుగా, ఎబిటా రూ. 2,495 కోట్లుగా, ఎబిట్డా మార్జిన్‌ 3.9 శాతంగా నమోదవుతుందని విశ్లేషకులు అంచనావేశారు. కానీ కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. హెచ్‌పీసీఎల్‌ పన్ను వ్యయం క్యూ2లో రూ. 564.7 కోట్లుగా నమోదైంది. ఇది జూన్‌ త్రైమాసికంలో నమోదైన రూ. 428 కోట్ల కంటే 32 శాతం అధికం కావడం గమనార్హం. ఫలితాలు వెలువడ్డాక హెచ్‌పీసీఎల్‌ షేరు విలువ 1.16 శాతం పడిపోయి రూ. 310.30 వద్ద ముగిసింది. 



You may be interested

రెండోరోజూ కొనసాగిన రికార్డు ర్యాలీ

Thursday 7th November 2019

5నెలల తరువాత 12వేల పైన ముగిసిన నిఫ్టీ మరో కొత్త రికార్డును నమోదు చేసిన సెన్సెక్స్‌ మార్కెట్లో రెండోరోజూ రికార్డుల ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ ఇంట్రాడే 218 పాయింట్లు లాభపడి 40,688.27 కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 184 పాయింట్ల లాభంతో 40,654 వద్ద స్థిరపడింది. మరోసూచీ నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 12,021 వద్ద స్థిరపడింది. సుమారు ఐదు నెలల అనంతరం నిఫ్టీ 12000 పైన ముగియడం ఇదే మొదటిసారి

సన్‌ఫార్మా లాభం రూ. 1065 కోట్లు

Thursday 7th November 2019

హెల్త్‌కేర్‌ దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 1065 కోట్ల లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 270 కోట్ల నష్టం ప్రకటించింది. ఆసమయంలో కంపెనీ వన్‌టైమ్‌ నష్టం రూ. 1214 కోట్లను భరించాల్సివచ్చింది. తాజా సమీక్షా కాలంలో కంఎపనీ రెవెన్యూ 17.1 శాతం పెరిగి రూ. 8123 కోట్లను చేరింది. దేశీయ, అంతర్జాతీయ విక్రయాలు పెరగడం కంపెనీ రెవెన్యూ పెరుగుదలకు దోహదం చేసింది. క్యు2తో దేశీయ

Most from this category