News


ఆరు రెట్లు పెరిగిన ఎస్‌బీఐ లాభం

Saturday 26th October 2019
news_main1572063666.png-29151

  • రూ.3,375 కోట్లకు ఎగసిన నికర లాభం 
  • కలసివచ్చిన బీమా వెంచర్‌లో వాటా విక్రయం 
  • మెరుగుపడిన రుణ నాణ్యత 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో దాదాపు ఆరు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.576 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.3,375 కోట్లకు పెరిగిందని ఎస్‌బీఐ తెలిపింది. తమ అనుబంధ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4.5 శాతం వాటా విక్రయం ద్వారా రూ.3,500 కోట్ల లాభం వచ్చిందని,  ఈ లాభానికి తోడు రుణ నాణ్యత మెరుగుపడటం వల్ల కూడా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వివరించారు.  మొత్తం ఆదాయం రూ.79.303 కోట్ల నుంచి రూ.89,348 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం రూ.23,075 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.24,600 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్‌ 2.78 శాతం నుంచి 3.22 శాతానికి చేరిందని పేర్కొంది. 

స్టాండ్‌అలోన్‌ లాభం రూ.3,012 కోట్లు 
స్డాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.945 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో మూడు రెట్లకు (212 శాతం)పైగా ఎగసి రూ.3,011 కోట్లకు పెరిగిందని కుమార్‌ వెల్లడించారు. ఆదాయం రూ.66,608 కోట్ల నుంచి రూ.72,851 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. బీమా వెంచర్‌లో వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులను ఒత్తిడి రుణాల వినియోగం కోసం పక్కన పెట్టామని వివరించారు.  ఈ ఏడాది మార్చిలో ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఉంటుందని పేర్కొన్నారు. ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓ ఈ ఆర్థిక సంవత్సరం ఉండదని స్పష్టం చేశారు. 

తగ్గిన మొండి బకాయిలు....
బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో రూ.2.05 లక్షల కోట్లుగా ఉన్న  స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.1.61 లక్షల కోట్లకు తగ్గాయని కుమార్‌ పేర్కొన్నారు. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 9.95 శాతం నుంచి 7.19  శాతానికి, నికర మొండి బకాయిలు 4.84 శాతం నుంచి 2.79 శాతానికి తగ్గాయని వివరించారు. తాజా మొండి బకాయిలు రూ.10,725 కోట్ల నుంచి రూ.8,805 కోట్లకు తగ్గాయని తెలిపారు. రుణ మాఫీల కారణంగా గతంలో తాజా మొండి బకాయిలు రూ.16,000 కోట్లకు పెరిగాయని, ఇప్పుడు 8,000 కోట్లకు తగ్గాయని, ఇది సాధారణమేనని పేర్కొన్నారు. తాజా స్థూల మొండి బకాయిలను 2 శాతం లోపే నియంత్రించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అయితే  గత క్యూ2లో రూ.10,381 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ2లో రూ.11,397 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.  ప్రొవిజన్‌​ కవరేజ్‌ రేషియో మాత్రం 71.23 శాతం నుంచి 81.23 శాతానికి పెరిగిందని తెలిపారు.  



You may be interested

మెరుపులు తగ్గిన ధంతేరాస్‌

Saturday 26th October 2019

దేశీయంగా అమ్మకాలు 40 శాతం డౌన్‌ అధిక పుత్తడి ధరే ఇందుకు కారణం  చిన్న ఆభరణాలకే కస్టమర్ల మొగ్గు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ధంతేరాస్‌కు పుత్తడి మెరుపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 40 శాతం దాకా తగ్గాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెరిగిన పసిడి ధరకుతోడు కస్టమర్ల వ్యయాలు తగ్గడం ఇందుకు కారణమని వర్తకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2018 ధంతేరాస్‌తో పోలిస్తే ప్రస్తుత పుత్తడి ధర

నిఫ్టీ వీక్లీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌

Saturday 26th October 2019

స్వల్పరేంజ్‌లో కదలికలు సంవత్‌ 20175ను సూచీలు పేలవంగా ముగించాయి. నిఫ్టీ శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులు చూసి చివరకు ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ కీలకమైన 11600 పాయింట్ల దిగువన ముగియడంతో పాటు వీక్లీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పడింది. వారం మొత్తానికి నిఫ్టీ 0.7 శాతం నష్టపోయింది. ప్రస్తుతం నిఫ్టీ రేంజ్‌ బౌండ్‌లో ఉందని, దీన్ని దాటితేనే తదుపరి కదలికలుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 11500- 11700 పాయింట్ల మధ్యనే నిఫ్టీ ఐదు రోజులుగా

Most from this category