రెండేళ్ల కనిష్ఠానికి క్యు1 రెవెన్యూవృద్ధి!
By D Sayee Pramodh

క్రిసిల్ అంచనా కమోడిటీ కేటగిరీల్లో లాభాల క్షీణతకు మందగమనం కారణమవుతుందని క్రిసిల్ తెలిపింది. కమోడిటీ ధరల్లో రాబోయే తరుగుదల స్టీల్, అల్యూమినియం, సహజవాయువు, పెట్రోకెమికల్స్ రంగాల్లో మోస్తరు వృద్ధికి కారణమవుతుందని వివరించింది. రూపీలో మందకొడి బలహీనత ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ఇందుకు తగ్గట్లే తాజాగా ఫలితాలు విడుదల చేసిన టీసీఎస్ అంచనాలను అందుకోలేకపోయింది.
కార్పొరేట్ ఇండియా రెవెన్యూపై వినిమయంలో మందగమనం తీవ్ర నెగిటివ్ ప్రభావం చూపనుందని రేటింగ్ ఏజన్సీ క్రిసిల్ పేర్కొంది. ఈ ప్రభావంతో క్యు1లో రెవెన్యూ వృద్ధి రెండేళ్ల కనిష్టానికి పడిపోతుందని అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రెవెన్యూలో 5-6 శాతం వృద్ధి ఉంటుందని, ఇది గత రెండేళ్లలో కనిష్ఠ స్థాయని తెలిపింది. గత నాలుగు త్రైమాసికాల్లో కంపెనీల సరాసరి రెవెన్యూ వృద్ధి 14- 15 శాతం ఉంది. దీంతో పోలిస్తే క్యు1 వృద్ది చాలా తక్కువని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం వినిమయంలో విస్తృత స్థాయి మందగమనమని, ఇది అన్ని రంగాలను ఇబ్బంది పెడుతోందని తెలిపింది. ప్రధానంగా ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వివరించింది. ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాప్‌లో దాదాపు 60 శాతానికి సమానమైన 295 కంపెనీలను క్రిసిల్ రిసెర్చ్ కోసం అధ్యయనం చేసింది. ఈ విశ్లేషణలో బీఎఫ్ఎస్ఐ, చమురు రంగాలను మాత్రం మినహాయించింది.
You may be interested
జులై 18న సీపీఎస్ఈ ఈటీఎఫ్ ఆరవ విడత
Wednesday 10th July 2019కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ఈ ఈటీఎఫ్(సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజస్ ఎక్సెంజ్ ట్రేడెడ్ ఫండ్) ఆరవ విడతను జులై 18న ప్రారంభించనుంది. దీని ద్వారా రూ.18,000 కోట్లను సమీకరించాలని భావిస్తుంది. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్ప్, పవర్ ఫైనాన్స్ కార్ప్, భారతి ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, ఎన్బీసీసీ ఇండియా, ఎన్ఎల్సీ ఇండియా, ఎస్‌జేవీఎన్ వంటి 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలలోని షేర్లను సీపీఎస్ఈ ఈటీఎఫ్
నష్టాల ముగింపు
Wednesday 10th July 201911500 దిగువకు నిఫ్టీ 174 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఒకరోజు విరామం తరువాత మార్కెట్లో మళ్లీ అమ్మకాల పర్వం కొనసాగింది. గత ట్రేడింగ్‌లో మిశ్రమంగా ముగిసిన సూచీలు బుధవారం భారీ నష్టాలను చవిచూసాయి. సెన్సెక్స్ 174 పాయింట్లు కోల్పోయి 38,557 వద్ద స్ధిరపడింది. నిఫ్టీ 57పాయింట్లను నష్టపోయి 11500 స్థాయి దిగువున 11,498.90 ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు, పెరిగిన ముడిచమురు ధరలతో పాటు దేశీయ మార్కెట్లో బడ్జెట్ ప్రతిపాదన