News


నత్తనడకన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు..

Tuesday 15th January 2019
Markets_main1547536694.png-23602

  • గడిచిన ఆరు నెలల్లో 5 నెలల అమ్మకాలు తగ్గుదల

న్యూఢిల్లీ: గతేడాది రెండవ అర్థభాగంలో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు నెమ్మదించాయి. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) సోమవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన ఆరు నెలల్లో 5 నెలల అమ్మకాలు తగ్గుదలను నమోదుచేశాయి. అక్టోబర్‌ మినహాయించి మిగిలిన ఐదు నెలల్లో అమ్మకాలు తగ్గాయి. తాజాగా డిసెంబర్‌ విక్రయాలు 2,38,692 యూనిట్లుగా వెల్లడి కాగా, అంతక్రితం ఏడాది ఇదే నెల్లో 2,39,723 యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్‌ నెలలో ఒక్క కార్ల అమ్మకాలే 1,55,159 యూనిట్లుగా ఉన్నాయని, అంతక్రితం ఏడాది ఇదే నెలలో దేశీ కార్ల అమ్మకాలు 1,58,338 యూనిట్లుగా ఉన్నాయని సియామ్‌ తెలిపింది. ‘గతేడాది పండుగ సీజన్‌ అమ్మకాలు అనుకున్నంత జరగలేదు. డీలర్‌ స్థాయిలో నిల్వలు పెరిగిపోయాయి. ఇందుకు అనుగుణంగా ఉత్పత్తి సంస్థలు పలు సర్దుబాట్లు చేశాయి. ఈ కారణంగానే డిసెంబర్‌ అమ్మకాలు తగ్గాయి.’ అని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వడేరా వ్యాఖ్యానించారు. ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే.. గతేడాది ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 5.08 శాతం పెరిగాయి. 2018లో 33,94,756 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాదిలో 32,30,614 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
ద్విచక్ర వాహన అమ్మకాలు తగ్గాయి
గతనెల మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 2.23 శాతం తగ్గాయి. 12,59,026 యూనిట్లు అమ్ముడైనట్లు సియామ్ తెలిపింది. మోటార్‌ సైకిల్‌ విక్రయాలు స్వల్పంగా పెరిగి 7,93,061 యూనిట్లుగా కాగా, స్కూటర్‌ సేల్స్‌ 6.08 శాతం తగ్గి 4,06,137 యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది.



You may be interested

10 లక్షల గదుల మైలురాయికి త్వరలోనే ‘ఓయో’

Tuesday 15th January 2019

2023 నాటికి 25 లక్షలు ప్రపంచంలో నంబర్‌ 1 కావడమే లక్ష్యం సంస్థ సీఈవో ఆదిత్య ఘోష్‌ కోల్‌కతా: ఆతిథ్య సేవల సంస్థ ఓయో హోటల్స్‌ అండ్‌ రూమ్స్‌ త్వరలోనే మిలియన్‌ గదుల (10 లక్షల గదులు) మార్క్‌ను చేరుకోనుందని ఆ సంస్థ సీఈవో (భారత్‌, దక్షిణాసియా) ఆదిత్య ఘోష్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణలో 4.6 లక్షల గదుల వసతి నిర్వహణ ఉంది. త్వరలోనే 10 లక్షల గదుల మార్క్‌ను చేరుకునేందుకు

జనవరి 28న శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎం సిరీస్’ విడుదల

Tuesday 15th January 2019

తొలి ఫోన్‌ భారత్‌లోనే విడుదల షావోమికి పోటీగా స్మార్ట్‌ఫోన్‌ ధరల శ్రేణి రూ.20,000 న్యూఢిల్లీ: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ షావోమికి పోటీగా.. కొరియా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ అతి త్వరలోనే ‘గెలాక్సీ ఎం సిరీస్’ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండంకల వృద్ధి రేటును సాధించడంలో భాగంగా తొలుత ఈఫోన్‌ సిరీస్‌ను భారత్‌లోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ధరలు రూ.20,000 వరకు ఉండనున్నట్లు శాంసంగ్‌

Most from this category