STOCKS

News


ప్రైవేట్‌ ‘సై’రన్‌

Thursday 21st November 2019
news_main1574306133.png-29740

  • బీపీసీఎల్, ఎస్‌సీఐ, కా¯న్‌కర్‌లో వాటాల విక్రయం
  • మరికొన్ని పీఎస్‌యూల్లో 51 శాతం లోపునకు వాటాలు
  • కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు 

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే దిశగా కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. పలు ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చమురు దిగ్గజం బీపీసీఎల్, షిప్పింగ్‌ సంస్థ ఎస్‌సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం, దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనర్‌ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)లో కేంద్రం తనకున్న మొత్తం 53.29 శాతం వాటాలను విక్రయించడంతో పాటు యాజమాన్య అధికారాలను కూడా బదలాయించనుంది. ఇందులో నుమాలిగఢ్‌ రిఫైనరీని మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రైవేటీకరణపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళన తలెత్తకుండా చూసేందుకు దీన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థ పరిధిలోకి చేర్చనున్నట్లు ఆమె వివరించారు.     మరోవైపు, కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గిస్తూ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రత్యేక బిల్లును క్యాబినెట్‌ ఆమోదించింది. దీన్ని ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు, ఇతర ఊరట చర్యల కారణంగా ప్రభుత్వానికి ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా దాదాపు రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. 

ప్రైవేటీకరణకు సంబంధించి క్యాబినెట్‌ నిర్ణయాల్లో కొన్ని ముఖ్యాంశాలు..


  • షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)లో మొత్తం 63.75 శాతం వాటాలను.. అలాగే కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాన్‌కర్‌)లో 30.9 శాతం వాటాలు ప్రభుత్వం విక్రయించనుంది. ప్రస్తుతం కాన్‌కర్‌లో కేంద్రానికి 54.80 శాతం వాటాలు ఉన్నాయి. 
  • టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (నీప్‌కో)లో మొత్తం వాటాలను ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌టీపీసీకి కేంద్రం విక్రయించనుంది.-
  • నియంత్రణ అధికారాలు తనకే ఉండే విధంగా.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ)లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకోనుంది. ఇందులో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకున్న వాటాల కారణంగా అంతిమంగా నియంత్రణాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. ఐవోసీలో కేంద్రానికి ప్రస్తుతం 51.5 శాతం వాటాలు ఉన్నాయి. ఐవోసీలో సుమారు 26.4 శాతం వాటాలను దాదాపు రూ. 33,000 కోట్లకు విక్రయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వ రంగ సంస్థలైన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ), ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ), ఆయిల్‌ ఇండియా (ఆయిల్‌)కు ఐవోసీలో 25.9 శాతం వాటాలు ఉండటంతో.. ఆ రకంగా కంపెనీపై నియంత్రణాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. You may be interested

ఏడాదిలోగా బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ విలీనం పూర్తి..!

Thursday 21st November 2019

కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్‌ వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ల విలీన ప్రక్రియ వచ్చే 18 నుంచి 24 నెలల్లోనే పూర్తికానుందని టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. భారీ నష్టాలతో కుదేలవుతున్న ఈ సంస్థలను విలీనం చేసేందుకు అక్టోబర్‌ 23న కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని వివరించారు. 2010 నుంచి

టెల్కోలకు ఊరట..

Thursday 21st November 2019

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన

Most from this category