News


జీఎస్‌టీ పరిధిలోకి ఏటీఎఫ్‌, గ్యాస్‌

Friday 6th December 2019
news_main1575604184.png-30085

  • 2020-21 బడ్జెట్లో ప్రతిపాదన..!

న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), సహజ వాయువులను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకుని వచ్చే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఈ రెండు కమోడిటీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న బహుళ పన్నుల భారాన్ని తగ్గించి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం కోసం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రానున్న 2020-21 బడ్జెట్లో వీటిని జీఎస్‌టీలో భాగం చేసే దిశగా కసరత్తు చేయనున్నారని అంచనావేశారు. ప్రస్తుతం వీటిపై కేంద్ర ప్రభుత్వం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్‌ వడ్డన కొనసాగుతుంది. విమానయాన సంస్థలకు ఏటీఎఫ్‌ భారమే మొత్తం ఖర్చులో సగం వరకూ ఉంటోంది. జీఎస్‌టీ పరిధిలో లేని కారణంగా ఐటీసీ (ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌) అందక వ్యయం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వీటిని జీఎస్‌టీలోకి తీసుకుని వస్తే వ్యాపార వాతావరణం మెరుగ్గా ఉంటుందని, దీంతో పాటు పర్యావరణ అనుకూలమైన సహజ వాయువు వినియోగానికి కూడా ఊతం లభించనుందని ఫిక్కీ సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. 



You may be interested

ఆర్‌బీఐకి దూరదృష్టి లేదు!

Friday 6th December 2019

మార్క్‌ మొబియస్‌ విమర్శ ఎకానమీలో రేట్ల తగ్గింపు అవసరం ఎంతో ఉందని, ఆర్‌బీఐ ఈ దఫా కూడా రేట్లను తగ్గించి ఉండాల్సిందని ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌మొబియస్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ రేట్లను యథాతధంగా కొనసాగించాలనుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ మరీ హ్రస్వదృష్టితో ఆలోచించిందని, దూరదృష్టి లోపించిందని విమర్శించారు. భారత్‌పై తమ పాజిటివ్‌ ధృక్పథం కొనసాగిస్తామన్నారు. 2020లో భారత్‌ మంచి ప్రదర్శన చూపుతుందన్నారు. భవిష్యత్‌లో దేశీయ వ్యయాల్లో టెలికం కీలకం కానుందని ఆయన చెప్పారు.

బ్యాంకింగ్‌లో మరిన్ని రుణాల రైటాఫ్

Friday 6th December 2019

కేటాయింపులు పెరగడం, రికవరీ బలహీనంగా ఉండటమే కారణం ఫిచ్‌ రేటింగ్స్ నివేదిక న్యూఢిల్లీ: దేశీ బ్యాంకులు మరిన్ని రుణాలను రైటాఫ్ (ఖాతాల నుంచి తొలగింపు) చేయాల్సి రావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ గురువారం పేర్కొంది. మొండిబాకీలకు జరపాల్సిన కేటాయింపుల పరిమాణం పెరుగుతుండటం, బాకీల రికవరీ అవకాశాలు బలహీనంగా ఉండటం వంటి అంశాలే ఇందుకు కారణమని వివరించింది. మొండిబాకీల్లో సుమారు 90 శాతం భాగం ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్‌బీ) ఉంటోంది. గడిచిన మూడేళ్లలో

Most from this category