News


కొనుగోలు శక్తి తగ్గొచ్చు...

Wednesday 20th November 2019
news_main1574220814.png-29716

ఎస్‌బీఐ ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌
హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఈ సారి రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి లభ్యత పెరిగింది. అయితే నాట్లు ఆలస్యం కావడం, పంట విస్తీర్ణం తగ్గడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదించే అవకాశం ఉందని ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ చాయిసెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘వాహన విక్రయాలు గణనీయంగా పడిపోవడాన్ని బట్టి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు. అయితే వాహన రంగంపై ఇటీవల ఎస్‌బీఐ ఓ అధ్యయనం చేసింది. దాంట్లో తేలిందేమంటే ప్రాంతం, వయసు, లింగ భేదం లేకుండా ఆర్థిక స్తోమతను బట్టి కార్లను కొంటున్నారు. అత్యధికులు ఖరీదైన మోడళ్లను కైవసం చేసుకుంటున్నారు. వీటి కోసం రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్య విషయమేమంటే భారత్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నట్టే.. కార్లను కొంటున్న మహిళలూ అధికమవుతున్నారు. అమెజాన్‌ సేల్‌లో ఎస్‌బీఐ కార్డ్‌ వినియోగదార్లు ఖర్చు చేసినదాన్ని బట్టి చూస్తే ద్వితీయ శ్రేణి నగరాల నుంచీ డిమాండ్‌ ఉంది. దీనినిబట్టి చూస్తే సెంటిమెంట్‌ లేకపోతే ఇంత డిమాండ్‌ ఎలా వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది’ అని వివరించారు. బంగారం ధరలు తగ్గే సూచనలు ఇప్పట్లో కనపడడం లేదని వ్యాఖ్యానించారు. 



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 77,000కుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Wednesday 20th November 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇప్పటికి 77,000 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం

త్వరలో యురేకా ఫోర్బ్స్‌ లిస్టింగ్‌ !

Wednesday 20th November 2019

న్యూఢిల్లీ: ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ తన అనుబంధ సం‍స్థ, యురేకా ఫోర్బ్స్‌ను త్వరలో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయనున్నది. వాటాదారులకు మరింత విలువను అందించడం లక్ష్యంగా యురేకా ఫోర్బ్స్‌ను లిస్టింగ్‌ చేయడం కానీ, లేదా ఈ కంపెనీలో కొంత వాటాను విక్రయించడానికి గానీ, లేదా ఈ రెండింటికి గానీ చేయడానికి ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు తగిన ప్రణాళికలను రూపొందించడానికి యాజమాన్యానికి డైరెక్టర్ల

Most from this category