News


ఐడియాలపై ప్రభుత్వరంగ బ్యాంకుల సమావేశాలు

Monday 19th August 2019
news_main1566194097.png-27855

  • ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకుల నిర్వహణ

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ సహా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు తమ శాఖల స్థాయిల్లో అధికారులతో తొలి విడత సమాలోచనలు నిర్వహించాయి. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లేందుకు గాను, బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత పటిష్ట పరచాలని, భవిష్యత్తుకు అనుగుణంగా తీర్చిదిద్దాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ ఓ నెల రోజుల పాటు బ్రాంచ్‌ల స్థాయిలో అధికారులతో సంప్రదింపుల ప్రక్రియను చేపట్టి.. వారి సలహాలు స్వీకరించాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. శనివారాల్లో దీన్ని చేపట్టాలని వారిచ్చిన సూచనలను, బ్యాంకింగ్‌ రంగ భవిష్యత్తు వృద్ధికి రోడ్‌మ్యాప్‌ రూపకల్పనలో వినియోగించాలని సూచించింది. దీంతో ఎస్‌బీఐ 502 రీజినల్‌ బిజినెస్‌ కార్యాలయాల్లో నిర్వహించగా, 15,000 మందికిపైగా అధికారులు పాల్గొన్నట్టు బ్యాంకు ఎండీ పీకే గుప్తా తెలిపారు. ‘‘చాలా సూచనలు వచ్చాయి. కొన్ని ప్రక్రియలను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించినవి. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ, బ్యాంకును మరింత కస్టమర్ల స్నేహశీలిగా మార్చడం ఇందులో ఉన్నాయి’’ అని గుప్తా వెల్లడించారు. పీఎన్‌బీ, బీవోబీ, కెనరా, ఆంధ్రా, సిండికేట్‌, ఐవోబీ బ్యాంకులు కూడా ఇవే తరహా భేటీలు నిర్వహించాయి. 
రుణ డిమాండ్‌ మందగించింది: ఎస్‌బీఐ
రుణాలకు డిమాండ్‌ మందగించినట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. ఆర్థిక రంగానికి ఉద్దీపనలు కావాలన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద తగినన్ని నగదు నిల్వలు ఉన్నాయని, సరఫరా పరంగా ఎటువంటి సమస్యల్లేవని స్పష్టం చేస్తూ, డిమాండే లేనట్టు చెప్పారు. 



You may be interested

ఈ వారానికి బుల్‌కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటర్‌!

Monday 19th August 2019

నిపుణుల సలహా నిఫ్టీ ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే 10900- 11000 పాయింట్ల వద్ద పుట్స్‌ బాగా పోగుపడినట్లు కనిపిస్తోంది. 11100, 11400 పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11000 పాయింట్ల వద్ద మద్దతు ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దగ్గర్లో గట్టి నిరోధం ఏమీ లేదని, అందువల్ల క్రమంగా 11200 నుంచి 11500 పాయింట్ల వరకు నిఫ్టీ ఎగబాకవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యాంకు నిఫ్టీలో సైతం పుట్‌

అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెరుగుతున్న భారత్‌ పెట్టుబడులు

Monday 19th August 2019

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో భారత పెట్టుబడులు ఇతోధికమవుతున్నాయి. జూన్‌ చివరికి 6 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 162.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అమెరికా ఖజానా విభాగం తాజా గణాంకాలను పరిశీలిస్తే... అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల పరంగా అగ్ర స్థానంలో జపాన్‌ ఉంది. ఆ దేశ పెట్టుబడులు 1.122 లక్ష కోట్ల (ట్రిలియన్‌) డాలర్లు మేర ఉండగా, ఆ తర్వాత చైనా 1.112 లక్షల కోట్ల డాలర్లతో

Most from this category