News


బీపీసీఎల్‌ రేసులో ఇతర పీఎస్‌యూలకు ఛాన్స్‌ లేదు

Friday 22nd November 2019
news_main1574392381.png-29769

  • స్పష్టం చేసిన చమురు మంత్రి 
  • పోటీ పెరిగితే చౌకగా సేవలు 


న్యూఢిల్లీ:- భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) కొనుగోలు రేసులో ఐఓసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. బీపీసీఎల్‌లో వాటా కొనుగోలు కోసం రూ.90,000 కోట్లు వెచ్చించాలని, ఈ స్థాయిలో వ్యయం చేయగల పీఎస్‌యూలు లేవని స్పష్టం చేశారు. బీపీసీఎల్‌తో సహా మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో  ప్రభుత్వానికి ఉన్న పూర్తి వాటాను విక్రయించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొన్ని పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే దిగువకు తగ్గించుకోవాలని కూడా సీసీఈఏ నిర్ణయించింది. 

వ్యాపారం... ప్రభుత్వ పని కాదు..
వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని, 2014 నుంచి ఇదే ఉద్దేశంతో ఉన్నామని ప్రధాన్‌ పేర్కొన్నారు. టెలికం, విమానయాన రంగాల్లో ప్రైవేట్‌ రంగాన్ని అనుమతించినందువల్లే పోటీ పెరిగి వినియోగదారులకు చౌకగా సేవలందుతున్నాయని వివరించారు. 
బీపీసీఎల్‌కు అస్సాంలో ఉన్న నుమాలీఘర్‌ రిఫైనరీని ప్రభుత్వ రంగ సం‍‍‍స్థగానే కొనసాగించాలని అస్సామ్‌ ముఖ్యమంత్రి కోరారని ప్రధాన్‌ చెప్పారు. ఆయన కోరిక మేరకు ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని వివరించారు. బీపీసీఎల్‌  ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని పేర్కొన్నారు. పోటీని పెంచడానికే బీపీసీఎల్‌ను ప్రైవేటీకరిస్తున్నామని తెలిపారు. 

ప్రభుత్వ రంగ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా కార్యకలాపాలు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని ప్రధాన్‌ చెప్పారు. అందుకే వాటిల్లో వాటాను విక్రయిస్తున్నామని, ఫలితంగా ఆ సం‍స్థల పనితీరు మరింతగా మెరుగుపడుతుందని వివరించారు. ఇక్కడ జరిగిన ఏఎస్‌ఏ స్టీల్‌ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. సెయిల్‌, ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 



You may be interested

భారత్‌లో డీబీఎస్‌ బ్యాంక్‌ విస్తరణ

Friday 22nd November 2019

బ్యాంకింగ్‌ సేవల్లో ఉన్న సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ భారత్‌లో విస్తరిస్తోంది. ప్రస్తుతం సంస్థకు శాఖలు, కియోస్క్‌లు 70 దాకా ఉన్నాయి. ఏడాదిలోగా ఈ సంఖ్య 100కు చేరుతుందని డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ ప్రియాశిష్‌ దాస్‌ తెలిపారు. వైస్‌ ప్రెసిడెంట్‌, బ్రాంచ్‌ హెడ్‌ కె.శ్రీనివాస రావుతో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 25 నగరాల్లో సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ఆరవ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ను త్వరలో హైదరాబాద్‌లోని వేవ్‌రాక్‌లో

ఎఫ్‌పీఐల డార్లింగ్స్‌... బీమా కంపెనీలే!

Friday 22nd November 2019

ఈ రంగంలోని కంపెనీల్లో అత్యధిక పెట్టుబడులు 2019-20 తొలి ఆరు నెలల్లో రూ.17,000 కోట్లు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించినది ఎస్‌బీఐ లైఫ్‌ గడిచిన ఏడాది కాలంలో షేర్లు సైతం భారీ ర్యాలీ న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగంలో ఉన్న అపార అవకాశాలు విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) బాగా ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా వారు ఈ రంగంలోని లిస్టెడ్‌ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో... అంటే

Most from this category