News


త్వరలోనే టీహెచ్‌డీసీలో డిజిన్వెస్ట్‌మెంట్‌

Monday 24th February 2020
news_main1582512817.png-32022

న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్ కార్పొరేషన్ (నీప్‌కో)లో వాటాలను మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీకి ఈ ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ డీల్ ద్వారా ఖజానాకు దాదాపు రూ. 10,000 కోట్లు రావొచ్చని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 65,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పడగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది మార్చి 31 నాటికి నీప్‌కో నికర విలువ రూ. 6,301 కోట్లుగా ఉంది. అటు టీహెచ్‌డీసీఐఎల్‌ విలువ రూ. 9,281 కోట్లుగా ఉంది. కేంద్రానికి టీహెచ్‌డీసీఐఎల్‌లో 74.23 శాతం, నీప్‌కోలో 100 శాతం వాటాలు ఉన్నాయి. 



You may be interested

భారత్‌తో వాణిజ్యం.. చైనాను దాటేసిన అమెరికా

Monday 24th February 2020

న్యూఢిల్లీ: భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో చైనాను వెనక్కి నెట్టేసి అమెరికా మరింత ముందుకు వచ్చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ వివరాల ప్రకారం 2018-19లో అమెరికాతో భారత ‍ద్వైపాక్షిక వాణిజ్యం 87.95 బిలియన్‌ డాలర్ల స్థాయికి వృద్ధి చెందింది. అదే ఏడాది చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.07 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2019-20లో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు చూసుకున్నా.. అమెరికా-భారత్‌ మధ్య

సీబీహెచ్ఎఫ్ఎల్‌లో 'సెంట్రల్ బ్యాంక్‌' వాటాల విక్రయం

Monday 24th February 2020

మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ముంబై: గృహ రుణాల వ్యాపార విభాగం సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ (సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌)లో మొత్తం 64.4 శాతం వాటాల విక్రయంపై ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ కోసం మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. షార్ట్‌లిస్ట్ అయిన సంస్థలు.. సీబీహెచ్ఎఫ్ఎల్‌లో సెంట్రల్ బ్యాంక్ వాటాలకు కొనుగోలుదారును వెతికిపెట్టాల్సి ఉంటుంది. "మా బ్యాంకు కూడా స్వయంగా గృహ

Most from this category