ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.95,760 కోట్ల మోసాలు
By Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) రూ.95,760 కోట్లకుపైగా మోసాలు చోటుచేసుకున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి 5,743 కేసులు నమోదయ్యాయి. నిధులపరంగా చూస్తే, ఈ మోసాల విలువ 95,760.49 కోట్లు’’ అని ఆర్థికమంత్రి తెలిపారు. బ్యాంకుల్లో మోసాల నివారణకు సమగ్ర చర్యలను చేపట్టినట్లు, నిర్వహణలో లేని కంపెనీలకు సంబంధించి 3.38 లక్షల బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసినట్లు కూడా ఆమె వెల్లడించారు. ఆటో రంగం పుంజుకుంటుంది...
పీఎంసీ డిపాజిట్లలో 78 శాతం మందికి ఊరట
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) డిపాజిటర్ల విషయంలో ఒక్కో ఖాతా నుంచి గరిష్ట నగదు ఉపసంహరణ పరిమితిని రూ. 50,000 వరకు పెంచినట్లు మరో ప్రకటనలో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీనితో డిపాజిటర్లలో 78 శాతం మందికి తమ అకౌంట్ల పూర్తి బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఏర్పడినట్లు ఆయన తెలిపారు.
ఆటోరంగంలో మందగమనం సైక్లికల్ (ఎగుడు-దిగుడు) అని భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ రంగానికి మద్దతు నివ్వడానికి ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటోందని తెలిపారు. ఈ రంగానికి రుణ లభ్యతకుగాను ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల నిధులు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
You may be interested
త్వరలోనే జియో చార్జీల పెంపు
Wednesday 20th November 2019న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’ త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్ ఫోన్ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని ప్రకటించిన కంపెనీ.. ఎంత మేర ట్యారిఫ్ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. మిగిలిన టెలికం దిగ్గజాలైన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సోమవారమే పెంపు ప్రకటన చేయగా.. ఒక రోజు తరువాత జియో కూడా
బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత భద్రత!
Wednesday 20th November 2019బీమా రూ.5 లక్షలకు పెంచే అవకాశం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చట్టం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలు ఆర్థిక శాఖ ముందు పలు ప్రతిపాదనలు న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. త్వరలో ఇది మరింత భద్రంగా మారనుంది. ప్రస్తుతం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష బీమాను బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఏదైనా బ్యాంకు సంక్షోభం పాలై