News


చెరి 50 శాతం వాటాలు

Friday 1st November 2019
news_main1572579348.png-29270

  • పీఎస్‌ఏ-ఫియట్‌ విలీన ప్రణాళిక వెల్లడి

ప్యారిస్‌: ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం పీఎస్‌ఏ, అమెరికా-ఇటాలియన్ వాహన తయారీ సంస్థ ఫియట్‌ క్రిస్లర్‌ (ఎఫ్‌సీఏ) సంస్థలు తమ విలీన ప్రతిపాదనను ఆవిష్కరించాయి. విలీనానంతరం నెదర్లాండ్స్ కేంద్రంగా మాతృసంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇందులో రెండు సంస్థలకు చెరి 50 శాతం వాటాలు ఉంటాయి. విలీన కంపెనీకి మొత్తం 170 బిలియన్ యూరోల అమ్మకాలు, 11 బిలియన్ యూరోల నిర్వహణ లాభాలు ఉంటాయని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. మాతృసంస్థలో ఎఫ్‌సీఏకి చెందిన జాన్ ఎల్కాన్‌ చైర్మన్‌గాను, పీఎస్‌ఏకి చెందిన కార్లోస్ టెవారెస్‌ సీఈవోగాను.. బోర్డు సభ్యుడిగాను ఉంటారు. విలీన కంపెనీ ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా ఆవిర్భవించనుంది. 



You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Friday 1st November 2019

గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లుగా పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు...నవంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ తొలిరోజైన శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 66 పాయింట్ల లాభంతో 40,195 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల పెరుగుదలతో 11,886 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందంపై క్రితం రోజు చైనా అనుమానాలు వ్యక్తపర్చడంతో గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు గరిష్టస్థాయి నుంచి క్షీణించాయి. అయితే

చైనాలో 5జీ సేవలు షురూ

Friday 1st November 2019

సర్వీసులు ప్రారంభించిన 3 టెల్కోలు బీజింగ్‌: టెక్నాలజీ వినియోగంలో అమెరికాను అధిగమించే క్రమంలో చైనా తాజాగా 5జీ టెలికం సేవలు ప్రారంభించింది. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు గురువారం ఈ సర్వీసులు ప్రారంభించాయి. బీజింగ్‌, షాంఘై తదితర 50 నగరాల్లో తమ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని చైనా మొబైల్‌ సంస్థ వెల్లడించింది. ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి (18 డాలర్లు) ప్రారంభమవుతాయని పేర్కొంది. అటు పోటీ సంస్థలైన

Most from this category