News


ఎల్‌ఐసీ ఐపీఓ బీమారంగానికి ప్రయోజనమే!

Wednesday 26th February 2020
news_main1582714408.png-32115

ఫిచ్‌ రేటింగ్స్‌

దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఐపీఓకు రావడం శుభపరిణామని బుధవారం ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ అభిప్రాయపడింది. ఐపీఓ కారణంగా ఎల్‌ఐసీ పారదర్శకత, జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని రేటింగ్‌ సంస్థ తెలిపింది. అలాగే దేశీయ బీమా పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కోంది.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో దేశీయ బీమారంగం కొంత వెనకబడింది. ఎల్ఐసీ లాంటి పెద్ద బీమా సంస్థ ఐపీఓ రానున్న నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు బీమారంగంలో తన పెట్టుబడుల శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఈ పరిణామంతో బీమా పరిశ్రమలోకి విదేశీ మూలధన ప్రవాహం మరింత పెరుగుతుంది. అనుకున్న విధంగానే ఎల్‌ఐసీ ఐపీఓ పూర్తి చేసుకుని స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో లిస్ట్‌ ఐనట్లైతే... ఇతర ప్రైవేటు రంగ భీమా సంస్థలు కూడా స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ అయ్యేందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుందని రేటింగ్‌ సంస్థ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

ఎల్‌ఐసీ ఐపీఓ పూర్తి చేసుకొని ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌ ఐన తర్వాత ఎక్చ్సేంజీలు రూపొందించుకన్న కఠినమైన నియమావళిని అనుసరించాల్సి ఉంటుంది. అందులో భాగంగా కంపెనీ నిర్ణయాలు బహిరంగపరచాల్సి ఉంటుంది. తద్వారా బీమా సంస్థ పారదర్శకత, జవాబుదారీతనం  బలమైన సంస్కృతిని అలవరుచుకోవాల్సి ఉంటుంది. ప్రతిపాదిత ఐపీఓ, ఒకసారి అమలైతే బీమా సంస్థ క్యాపిటల్‌ బేస్‌ పెరగడంతో పాటు రెగ్యూలేటరీ క్యాపిటల్‌ పొజిషన్‌ మరింత పెరుగుతుందని ఫిచ్‌ పేర్కోంది.

నిధుల సమీకరణలో భాగంగా ఎల్‌ఐసీలో వాటాలు విక్రయించేందుకు కేంద్రం సిద్ధమైన విషయాన్ని కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎల్‌ఐసీలో ప్రభుత్వం 100 శాతం వాటాను కలిగి ఉంది. 



You may be interested

ఎల్‌ఐసీ ఎన్‌పీఏలు చాలా ఎక్కువే..!

Thursday 27th February 2020

దేశ ప్రజల్లో ఎక్కువ మంది విశ్వసించే భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) డెట్‌ పోర్ట్‌ఫోలియోలో స్థూల నిరర్థక ఆస్తులు (వసూలు కష్టంగా ఉన్నవి) 2019 చివరికి 7.49 శాతానికి చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకు వచ్చే ప్రణాళికల్లో ఎల్‌ఐసీ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌ చేయాలని ఆశిస్తున్న వారు ఈ అంశాలను తెలుసుకోవాల్సిందే.   2018 చివరికి డెట్‌ పెట్టుబడుల్లో ఎన్‌పీఏలు 6.06 శాతంగానే ఉంటే,

హెచ్‌ఎంఈఎల్‌ రేటింగ్‌ను తగ్గించిన మూడీస్‌!

Wednesday 26th February 2020

ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌  సంస్థ  హెచ్‌పీసీఎల్‌-మిట్టల్‌ ఎనర్జీ లిమిటెడ్‌(హెచ్‌ఎంఈఎల్‌) రేటింగ్‌ను Ba1 నుంచి Ba2కు తగ్గించింది. స్టేబుల్‌గా ఉన్న ర్యాంకింగ్‌ను నెగిటివ్‌గా మార్చింది. ఇంధన డిమాండ్‌ తగ్గడం, రిఫైనింగ్‌​మార్జిన్స్‌ బలహీనంగా ఉండడంతో  రేటింగ్‌ను తగ్గించినట్లు మూడీస్‌ సంస్థ తెలిపింది.హెచ్‌ఎంఈఎల్‌ క్రెడిట్‌ మెట్రిక్స్‌ క్షీణత, ఆసియాలో రిఫైనింగ్‌ బలహీనపడడం, కంపెనీలు పెట్రోకెమికల్స్‌ విస్తరించేందుకు అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడాన్ని ..తగ్గించిన రేటింగ్‌ Ba2 ప్రతిబింబిస్తుందని మూడీస్‌ విశ్లేషకులు శ్వేతా పటోడియా

Most from this category