News


కరెక‌్షన్‌లో కొనేస్తున్నారు!

Thursday 5th September 2019
news_main1567676533.png-28219

వాటాలు పెంచేసుకుంటున్న ప్రమోటర్లు
ఆగస్టు నెలలో మార్కెట్లో వచ్చిన కరెక‌్షన్‌ ప్రమోటర్లకు వరంగా మారింది. చాలామంది ప్రమోటర్లు ఈ పతనంలో తమ సొంత కంపెనీల షేర్లను తక్కువ ధరకు కొని వాటాను పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలంచిన్న కంపెనీల ప్రమోటర్లే కాకుండా పెద్ద కంపెనీల ప్రమోటర్లు కూడా ఇలా వాటాలు పెంచుకోవడం గమనార్హం. ఇలాంటివాటిలో యునైటెడ్‌ స్పిరిట్స్‌, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, వొడాఫోన్‌ ఐడియా, చోళ ఫైనాన్షియల్స్‌, దీపక్‌ నైట్రేట్‌, సంగమ్‌ ఇండియా, అతుల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌, క్వెస్‌ తదితరాలున్నాయి. మార్కెట్లోని బలహీనమైన సెంటిమెంట్‌ కారణంగా తమ కంపెనీల ఫండమెంటల్స్‌ దెబ్బతినకూడదన్న భావనతో ప్రమోటర్లు సొంత షేర్లను కూడబెట్టడం చేస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. దీనికితోడు మార్కెట్లో వచ్చిన కరెక‌్షన్‌తో పలు షేర్ల వాల్యూషన్లు బాగా దిగిరావడం కూడా ప్రమోటర్లను ఆకర్షించింది.  
వివిధ కంపెనీల ప్రమోటర్లు కొనుగోలు చేసిన వాటాల వివరాలు ఇలా ఉన్నాయి...

ప్రమోటర్లే కొనుగోలు చేయడం వల్ల సదరు కంపెనీపై ఇన్వెస్టర్లలో సదభిప్రాయం ఏర్పడే ఛాన్సులున్నాయి. ఇన్వెస్టర్లు సాధారణంగా కొనుగోళ్ల సమయంలో పరిశీలించే పారామీటర్లలో ప్రమోటర్ల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా ముఖ్యమేనని ఈక్వినోమిక్స్‌ రిసెర్చ్‌ వివరించింది. ఒక ఇన్‌సైడర్‌గా ప్రమోటర్‌కు సదరు కంపెనీ వ్యాపారం, దాని విలువ తెలుస్తాయని, అందువల్ల షేరు అంతర్లీన విలువపై అవగాహన ఉంటుందని తెలిపింది. బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనల అనంతరం స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు అమ్మకాలు తెగబడడ,ం, దీంతో రెండు నెలల్లో సూచీలు దాదాపు 8 శాతం క్షీణించాయి.You may be interested

మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌

Thursday 5th September 2019

 మార్కెట్‌ గురువారం మిశ్రమంగా ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్‌ 80 పాయింట్ల నష్టంతో 36,644.42 వద్ద, నిఫ్టీ 3.25 పాయింట్ల స్వల్పలాభంతో 10,847.90 ముగిశాయి. అటో, మీడియా, ఫార్మా,, ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, ఆర్థిక సర్వీసులు, రియల్టీరంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు లాభంతో

టాటామోటర్స్‌ రయ్‌

Thursday 5th September 2019

రెండు రోజుల వరుస పతనం అనంతరం టాటామోటర్స్‌ షేర్లు లాభాల పట్టాలెక్కాయి. ఆగస్ట్‌లో అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ విక్రయాలు క్షీణించినప్పటికీ.., షేర్లు ర్యాలీ చేయడం విశేషం. నేడు బీస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 110.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఒకదశలో 7శాతం లాభపడి రూ.117.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ జేఎల్‌ఆర్‌ అమ్మకాలు

Most from this category