News


పీఎంసీ కేసులో ఇరువురు హెచ్‌డీఐఎల్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

Friday 4th October 2019
news_main1570161322.png-28706

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో-ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ కుంభకోణంలో హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) డైరెక్లర్లు ఇరువురు అరెస్ట్‌ అయ్యారు. ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులు రుణ డిఫాల్ట్‌కు సంబంధించి రాకేష్‌ వాద్వాన్‌, ఆయన కుమారుడు సారంగ్‌ వాద్వాన్‌లను అరెస్ట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌డీఐఎల్‌కు చెందిన రూ.3,500 కోట్లను ఈఓడబ్ల్యూ జప్తు చేసినట్లు కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. బ్యాంకుకు రూ.4,355.43 కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్‌, హెచ్‌డీఐఎల్‌ సీనియర్‌ అధికారులపై ఈఓడబ్ల్యూ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో సస్పెండయిన పీఎంసీ బ్యాంక్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాయ్‌ థామస్‌, చైర్మన్‌ వార్యాన్‌ సింగ్‌, ఇతర ఎగ్జిక్యూటివ్‌ల పేర్లను చేర్చారు.  కేసులో దర్యాప్తుకు సిట్‌ కూడా ఏర్పాటయ్యింది. 



You may be interested

బీపీసీఎల్‌కు రేటింగ్ డౌన్‌గ్రేడ్ ముప్పు

Friday 4th October 2019

ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై మూడీస్‌ వ్యాఖ్యలు ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)ను ప్రైవేటీకరించిన పక్షంలో రేటింగ్‌ను తగ్గించే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ హెచ్చరించింది. ప్రస్తుతం సార్వభౌమ రేటింగ్ స్థాయిలో ఉన్న ట్రిపుల్‌ బి మైనస్‌ స్థాయిని బీఏ1 స్థాయికి తగ్గించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రైవేటీకరణతో బీపీసీఎల్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధం తెగిపోయి.. బాండ్ల ఉపసంహరణ కోసం ఒత్తిడి పెరుగుతుందని,

5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం సాధ్యమే

Friday 4th October 2019

5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం సాధ్యమే పటిష్టమైన ప్రభుత్వ విధానాల ఊతం వ్యాపారాల నిర్వహణకు అనువైన వాతావరణం  డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో డీపీఐఐటీ కార్యదర్శి మహాపాత్ర వెల్లడి న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు భారత్‌లో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్‌ మహాపాత్ర వెల్లడించారు. పటిష్టమైన విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సారథ్యంలో ఈ

Most from this category