News


బజాజ్‌ అటో ఫలితాలు అంచనాలను మించాయ్‌...!

Thursday 30th January 2020
news_main1580374500.png-31337

బజాజ్‌ అటో మూడో త్రైమాసికపు ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు మించి నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఈ క్యూ3లో రూ.1,262 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సాధించిన రూ.1,102 కోట్లతో ఇదే ఇది 15శాతం అధికం. విశ్లేషకులు రూ.1,190 కోట్ల నికరలాభాన్ని సాధించవచ్చని అంచనా వేశారు. నిర్వహణ ఆదాయం 3శాతం పెరిగి రూ.7,640 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఇదే క్వార్టర్‌లో ఇది రూ.7,436 కోట్లుగా ఉంది. ఇబిటా 13శాతం పెరిగి రూ.1,406 కోట్లుగానూ, ఇబిటా మార్జిన్‌ 18.4శాతంగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఇబిటా మార్జిన్‌ 16.7శాతంతో పోలిస్తే 1.7శాతం అధికం. క్వార్టర్‌ టు క్వార్టర్‌ ఇబిటా మార్జిన్‌ 150 బేసిస్‌ పాయింట్లు వృద్ధిని సాధించింది

మెటిరియల్‌ ధరలు తగ్గడంతో పాటు వాహన ధరలను పెంచడంతో మెరుగైన ఫలితాలను సాధించగలిగామని బజాజ్‌ అటో అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా డిసెంబర్‌ త్రైమాసికంలో మోటారు సైకిల్ అమ్మకాలు 14శాతం క్షీణించినప్పటికీ బజాజ్‌ అటో అమ్మకాలు మార్కెట్‌ వర్గాలను ఆకట్టుకోలిగాయి. మూడో క్వార్టర్‌లో కంపెనీ మొత్తం 96వేల వాహనాలను విక్రయించింది.

ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించిన నమోదు కావడంతో షేరు  మార్కెట్‌ నష్టాల్లో కొనసాగుతున్నప్పటీకీ... మధ్యాహ్నం 2గంటలకు బజాజ్‌ అటో షేరు 2శాతం లాభంతో రూ.3,146.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ -50 సూచీ గెయినర్లలో మొదటిస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఈ ఆరు రంగాలకూ బడ్జెట్‌ పుష్‌?!

Thursday 30th January 2020

ఆటో, మెటల్‌, రియల్‌ ఎస్టేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆగ్రోకెమికల్స్‌ వినియోగ రంగానికీ చోటు? దేశ ప్రజలంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న​సాధారణ వార్షిక బడ్జెట్‌ను కేం‍ద్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనుం‍ది. ద్రవ్యలోటును కట్టడి చేస్తూనే.. మౌలిక సదుపాయాల రంగానికి భారీ పెట్టుబడులు, వృద్ధికి ఊతమిచ్చే బాటలో వినియోగ రంగంలో డిమాండ్‌ పెంచే చర్యలతో పారిశ్రామిక రంగానికి జోష్‌నివ్వడం వంటి అంశాలపై కొద్ది రోజులుగా ఆర్థిక శాఖ భారీ కసరత్తునే నిర్వహించినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

ఐటీ తగ్గిస్తే ఈ షేర్లకు పండుగే!

Thursday 30th January 2020

వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి తగ్గిస్తే ఎకానమీలో వినిమయం పెరుగుతుందని ఎకనమిస్టులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ఈ దఫా బడ్జెట్లో ఐటీ తగ్గింపు యోచనలో ఉన్నట్లు ఊహాగానాలున్నాయి. ఇదే నిజమైతే పలు రంగాలకు ముఖ్యంగా ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లకు మంచి ఉషారు వస్తుందని మార్కెట్‌నిపుణులు అంచనా వేస్తున్నారు. టాక్స్‌ స్లాబుల మార్పుతో బ్రాండెడ్‌ దుస్తులు, ఫుట్‌వేర్‌, హోటల్స్‌, రెస్టారెంట్లకు గిరాకీలు పెరుగుతాయని షేర్‌ఖాన్‌ అభిప్రాయపడింది. దీంతో పాటు దీర్ఘకాలంలో హౌసింగ్‌, నిర్మాణ

Most from this category