News


రైలు వీల్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం

Monday 10th February 2020
news_main1581308612.png-31642

ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి చరిత్రలో మరో ముందడుగు పడింది. భారతీయ రైల్వేతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తరప్రదేశ్‌ రాయబరేలీలో నిర్మించిన ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంట్‌లో శనివారం వీల్స్‌ ఉత్పత్తి ప్రారంభించారు. స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పి.కె.రథ్‌ తొలి వీల్‌ ఉత్పత్తిని అధికారికరంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్లాంట్‌ నిర్మాణానికి రూ.1,680 కోట్లు వ్యయం అయిందన్నారు. ఈ ప్లాంట్‌లో ఏడాదికి లక్ష రైలు వీల్స్‌ తయారు చే యగల సామర్ధ్యం కలిగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) కె.కె. ఘోష్, డైరెక్టర్‌ (కమర్షియల్‌) డి.కె. మొహంతి, డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎ.కె. సక్సేనా, రైల్వే బోర్డు ఈడి లక్ష్మీ రామన్, ఎస్‌.ఎం.ఎస్‌. జర్మనీ కంపెనీ సీనియర్‌ అధికారి కుల్జీ, ఎస్‌.ఎం.ఎస్‌ ఇండియా సీనియర్‌ అధికారి గ్రీనియర్‌తో పాటు స్టీల్‌ప్లాంట్, మెకాన్‌ సంస్థల ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. 



You may be interested

వేరే ఫండ్‌కు మారిపోవాలా ?

Monday 10th February 2020

(ధీరేంద్ర కుమార్‌ వాల్యూ రీసెర్చ్‌ సీఈవో) ప్ర: ఒక కంపెనీ(యాక్సిస్‌) మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర కంపెనీల మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే మంచి రాబడులనిస్తున్నాయి. ఒకే కేటగిరీ అని కాకుండా అన్ని కేటగిరీల ఫండ్స్‌ విషయంలో కూడా ఈ కంపెనీ పనితీరు బాగా ఉంది. దీనికేమైనా ప్రత్యేకమైన కారణాలున్నాయా ? -సూరిబాబు, విశాఖపట్టణం  జ: సదరు కంపెనీ అనుసరిస్తున్న పెట్టుబడుల వ్యూహం మంచి ఫలితాలనిస్తున్నందువల్ల ఆ కంపెనీ ఫండ్స్‌ మంచి పనితీరు కనబరుస్తున్నాయని చెప్పవచ్చు. ఒక్కో

స్వల్పంగా తగ్గిన పుత్తడి

Monday 10th February 2020

 సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయంలో గత ముగింపు ధరతో పోలిస్తే రూ.72 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ. 40,572.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  గత ముగింపు ధరతో పోలిస్తే స్వల్పంగా ఒక డాలరు​ తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,574.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  (శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా

Most from this category