News


ప్రభుత్వ మైనింగ్‌ కంపెనీలను ప్రైవేట్‌ పరం చేయండి

Monday 24th June 2019
news_main1561357044.png-26520

  • బ్యాంక్‌లకు, పీఎస్‌యూలకు మరింత స్వయంప్రతిపత్తి 
  • ప్రధానికి వేదాంత అనిల్‌ అగర్వాల్‌ సూచన 

న్యూఢిల్లీ: ఎన్‌ఎమ్‌డీసీతో సహా మరో ఐదు ప్రభుత్వ రంగ మైనింగ్‌ కంపెనీలను ప్రైవేట్‌పరం చేయాలని వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. హిందుస్తాన్‌ జింక్‌, హిందుస్తాన్‌ కాపర్‌, కోలార్‌ గోల్డ్‌, యురేనియమ్‌ -కార్పొరేషన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీల్లో వాటాలను కేంద్రం పూర్తిగా విక్రయించాలని పేర్కొన్నారు. ముందస్తు బడ్జెట్‌ సమావేశంలో భాగంగా శనివారం ప్రధానితో  ఆర్థిక వేత్తలు, పారిశ్రామికవేత్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన అనిల్‌ అగర్వాల్‌ పలు సూచనలు చేశారు. ఉద్యోగ కోతలు లేకుండా ప్రైవేటీకరణ జరపడం వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, సామర్థ్యం పెరుగుతుందని, దేశీయంగా ఉత్పత్తి పెరుగుతుందని అనిల్‌ పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశానికి టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌, ఐటీసీ చైర్మన్‌ సంజీవ్‌ పురి కూడా పాల్గొన్నారు. 

దిగుమతుల బిల్లు లక్ష కోట్ల డాలర్లకు...!
ప్రస్తుతం భారత దిగుమతుల బిల్లు 40,000 కోట్ల డాలర్లుగా ఉందని అనిల్‌  పేర్కొన్నారు. ఆయిల్‌, గ్యాస్‌, మినరల్స్‌, పుత్తడి వంటి లోహాల్లో ఉత్పత్తిని పెంచుకోలేకపోతే ఈ బిల్లు త్వరలోనే లక్ష కోట్ల డాలర్లకు చేరగలదని వివరించారు. చమురు ఉత్పత్తిని రెట్టింపు చేయడం, పుత్తడి ఉత్పత్తిని 300 టన్నులకు చేరడం జరిగితే ప్రస్తుతమున్న కరంట్‌ అకౌంట్‌ లోటు(క్యాడ్‌) పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొన్నారు. 
పీఎస్‌యూ అధికారులు మరింత సాధికారత....
ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంక్‌ల్లో ప్రభుత్వ వాటాను 50 శాతం లోపు తగ్గించి, స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని అనిల్‌ అగర్వాల్‌ సూచించారు. ఇలా చేస్తే, వాటి పనితీరు మూడు రెట్లు పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మంచి ప్రతిభ గల అధికారులున్నారని, భవిష్యత్తులో విచారణలు జరుగుతాయనే భయాలతో వారు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, నిర్ణయాలు తీసుకునేలా వారికి సాధికారత కల్పించాలని సూచించారు. బొగ్గు, బాక్సైట్‌, రాగి, ఇనుప ఖనిజాలకు సంబంధించిన మైనింగ్‌ బ్లాక్‌లకు  తక్షణం వేలం నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం గోవా, కర్నాటకల్లో మైనింగ్‌పై ఆంక్షలు ఉన్నాయని, ఈ ఆంక్షలు ఉండకుండా చూడాలని సూచించారు. మైనింగ్‌ కార్యకలాపాలు పెరిగితే ఆర్థిక వ్యవస్థకు 50000 కోట్ల డాలర్ల సంపద జత అవుతుందని, రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. You may be interested

వరుణ దేవుడా... క్రికెట్‌ మ్యాచ్‌లకు అడ్డురాకు...!

Monday 24th June 2019

బీమా కంపెనీల ప్రార్థన వర్షంతో మ్యాచులు రద్దయితే రూ.100 కోట్ల భారం న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్‌ సందర్భంగా... భారత మ్యాచులకు అడ్డు పడొద్దు వరుణుడా..!? అని సగటు అభిమానులు ప్రార్థించడం సర్వ సాధారణం. కానీ, బీమా కంపెనీలు కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే వర్షం కారణంగా భారత మ్యాచులు రద్దయితే బీమా కంపెనీలు పరిహారం రూపంలో రూ.100 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుంది. సెమీ ఫైనల్స్‌కు ముందు భారత్‌ మరో

జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియ ప్రారంభం

Monday 24th June 2019

90 రోజుల్లో రిజల్యూషన్‌ ప్రణాళిక తదుపరి విచారణ జూలై 5న  న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌సీఎల్‌టీ(నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌)లో జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా ప్రక్రియ కోసం పిటీషన్‌ దాఖలు చేసింది.ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్‌ను ఈ నెల 20న స్వీకరించింది. 2016 నాటి ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్‌రప్టసీ చట్టం ప్రకారం

Most from this category