News


ఇన్‌ఫ్రా పెట్టుబడులతో భారీగా ఉద్యోగ అవకాశాలు

Thursday 3rd October 2019
news_main1570074894.png-28683

  • ఐడీఎఫ్‌సీ ఇనిస్టిట్యూట్‌ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల కల్పనలో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించవచ్చని ఐడీఎఫ్‌సీ ఇనిస్టిట్యూట్‌ తన నివేదికలో వెల్లడించింది. దేశంలోని 47.3 కోట్ల బలమైన శ్రామిక శక్తికి తగిన ఉద్యోగ కల్పనకు ఇది చక్కటి పరిష్కార మార్గమని వివరించింది. ‘మౌలిక సదుపాయాల పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలోనే ప్రత్యక్ష ఉపాధిని కల్పించేందుకు వీలుంది. తద్వారా ప్రైవేటు రంగం కూడా ఊపందుకుంటుంది. ప్రస్తుత క్లిష్టపరిస్థితులను ఎదుర్కునేందుకు ఉత్సాహవంతమైన ప్రైవేట్ రంగం అవసరం కూడా ఉంది. ఉద్యోగాలను సృష్టించడానికి పట్టణీకరణ కీలకం కాగా, మౌలిక సదుపాయాల కల్పనతో వీటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయవచ్చు. వేగవంతమైన పట్టణీకరణకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు మరింత పెరిగితే వృద్ధికి ఆస్కారం ఉంటుంది’ అని పేర్కొంది. తాజా నివేదికను 18 జిల్లాల్లోని 2,500 సంస్థల ప్రాథమిక సర్వే ఆధారంగా రూపొందించినట్లు వెల్లడించింది. 

రోడ్లు, నీటి సమస్యలను అధిగమించాలి...
వ్యవసాయ అనుబంధ ప్రాంతాల్లోని 61 శాతం సంస్థలు రోడ్లు సరిగా లేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు వెల్లడించాయి. సర్వేలో పాల్గోన్న మొత్తం సంస్థల్లో 84 సంస్థలు రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపాయి. ఈ సమస్య సంస్థలకు అతి పెద్దదిగా కొనసాగుతుండగా.. రెండవ అత్యంత సాధారణ సమస్యగా విద్యుత్ ఉన్నట్లు 33 శాతం సంస్థలు సర్వేలో తెలియజేశాయి. నీటి సమస్యతో ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు 28 శాతం సంస్థలు వెల్లడించాయి. 



You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Thursday 3rd October 2019

‍ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల క్షీణతతో 38,050 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో 11,285 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. 

పైపైన ఆడిటింగ్‌.. సంక్షోభానికి కారణం

Thursday 3rd October 2019

పీఎంసీ బ్యాంకు సస్పెండెడ్‌ ఎండీ థామస్‌ భారీ రుణ ఖాతాల వివరాలను దాచి ఉంచాం బ్యాంకు పేరు దెబ్బతింటుందనే అలా చేశాం ఆర్‌బీఐకి రాసిన లేఖలో వెల్లడి ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)లో సంక్షోభానికి ఆడిటర్ల తీరే కారణమని బ్యాంకు ఎండీగా సస్పెన్షన్‌కు గురైన జాయ్‌థామస్‌ ఆరోపించారు. సమయాభావంతో బ్యాంకు పుస్తకాలను పైపై ఆడిటింగ్‌ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌బీఐకి ఆయన ఐదు పేజీల లేఖను రాశారు. వసూలు

Most from this category