News


భారీగా పెరగనున్న టీవీలు, ఫ్రిజ్‌లు, మొబైల్‌ ధరలు..?

Wednesday 19th February 2020
news_main1582088900.png-31923

కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ధరలు మరింత పెరగనున్నాయి. టీవీలు, ఏయిర్‌ కండీషనర్స్‌, రిఫ్రిజిరేటర్‌లు, కొన్నిరకాల స్మార్ట్‌ఫోన్ల రేట్లు ఫిబ్రవరి చివరినాటికి భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయా పరిశ్రమల సీనియర్‌ ఎక్సిక్యూటివ్‌లు చెబుతున్నారు. కోవిడ్‌-19(కరోనావైరస్‌) దాటికి చైనా నుంచి దిగుమతి అవ్వాల్సిన ఎలక్ట్రికల్‌ విడిభాగాలు ఆగిపోయాయి. దీంతో ఎలక్ట్రిక్‌ పరికరాల విడిభాగాల కొరత ఏర్పడడంతో కంపెనీలన్నీ డిస్కౌంట్స్‌, ప్రమోషనల్‌ ఆఫర్లని ఆపివేయడంతో 3-5శాతం ధరలు పెరిగే అవకాశం ఉందని ఎక్సిక్యూటివ్‌లు వెల్లడించారు. విడిభాగాల కొరతతో అంతర్జాతీయంగా టీవీల ధరలు ఇప్పటికే 15-20 శాతం పెరిగాయి.దీని ప్రభావంతో మన దేశంలో టీవీలపై 7-10 శాతం ధరలు పెరగనున్నాయి. కాగా అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్‌  అనుకున్న దానికంటే తక్కువ ఉత్పత్తి జరుగుతుండడంతో ఐఫోన్లను తాత్కాలికంగా  పరిమితంగా సరఫరా చేస్తోంది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌తోపాటు మరో 7 మోడళ్ల ఉత్పత్తి ఇండియన్‌ మార్కెట్‌ డిమాండ్‌కు సరిపోదని, 70-75 శాతం దిగుమతి చేసుకోవాలని సంస్థ అధికారులు తెలిపారు.ఈ కొరత తీరాలంటే మరో నెలరోజులపైనే పడుతుందన్నారు. కాగా ప్రీమియర్‌ స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్‌ వాటా దేశంలో తక్కువే కాబట్టి వాటిపై ధరల ప్రభావం ఉండకపోవచ్చు.
 



You may be interested

వొడాఫోన్‌ఐడియాకు ఎటువంటి విలువా లేదు!

Wednesday 19th February 2020

సిటీ గ్రూప్‌ అంచనా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వొడాఫోన్‌ ఇండియాకు ఎలాంటి ఈక్విటీ విలువ లేదని సిటీగ్రూప్‌ వ్యాఖ్యానించింది. అందుకే వీఐఎల్‌ షేరు టార్గెట్‌ను డ్రాప్‌ చేసినట్లు(ఎలాంటి టార్గెట్‌ ధర ప్రకటించకపోవడం) తెలిపింది. వీఐఎల్‌ భవితవ్యంపై సుప్రీం కోర్టు తాజా తీర్పు అనంతరం నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. ఇక ప్రస్తుతానికి వీఐఎల్‌కు ఉన్న ఒకే ఒక ఆఖరు ఆశ ప్రభుత్వ సాయమని, కానీ ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ఈ దిశగా ఎలాంటి సంకేతాలు

తిరిగి రికార్డుస్థాయికి పసిడి

Wednesday 19th February 2020

దేశీయ మల్టీకమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో పసిడి ధర మళ్లీ రికార్డు గరిష్ట స్థాయిని అందుకుంది. ఈ జనవరి 31న నమోదుచేసిన రికార్డు గరిష్టస్థాయి (రూ. 41,293)ని అధిగమించి రూ.41,544.00 వద్ద ఆల్‌టైం హైని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం ఔన్స్‌ పసిడి ధర ఆరువారాల గరిష్టానికి 1605 డాలర్లపైకి ఎగిసింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో అంతర్జాతీయ వృద్ధి భయాల నేపథ్యంలో చైనాతో పాటు పలు దేశాలు భారీగా ఉద్దీపనలు ప్రకటించవచ్చని

Most from this category