News


చిన్న మొత్తాల పొదుపులపై వడ్డీ రేట్లు యథాతథం

Wednesday 1st January 2020
news_main1577849584.png-30575

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలైన ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌ వంటి వాటిపై ప్రస్తుతమున్న రేట్లనే జనవరి-మార్చి త్రైమాసికానికి కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో నిర్ణయించిన రేట్లే తదుపరి మూడు నెలల కాలానికి కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీపై వడ్డీ రేటు 7.9 శాతంగా, కిసాన్‌ వికాస్‌ పత్రపై 7.6 శాతంగా, ఐదేళ్ల సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 8.6 శాతంగా, సుకన్య సమృద్ధి యోజనలో 8.4 శాతంగా, ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌పై 7.2 శాతంగా కొనసాగుతాయి. 1-5 ఏళ్ల కాల వ్యవధి టర్మ్‌ డిపాజిట్లపై 6.9-7.7 శాతం మధ్య రేటు అమలవుతుంది. 



You may be interested

మౌలిక రంగం డౌన్‌

Wednesday 1st January 2020

నవంబర్‌లో 1.5 శాతం క్షీణత న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా నాలుగో నెలా క్షీణించింది. 2019 నవంబర్‌లో వృద్ధి 1.5 శాతం తగ్గింది. 2018 నవంబర్‌లో ఈ ఎనిమిది పరిశ్రమలు 3.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. తాజాగా ఎనిమిదింట అయిదు పరిశ్రమలు ప్రతికూల వృద్ధి నమోదు చేయడంతో మొత్తం గ్రూప్ వృద్ధి మందగించింది. నవంబర్‌లో బొగ్గు, క్రూడాయిల్‌, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్‌ ఉత్పత్తి

కార్వీ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ

Wednesday 1st January 2020

ఆర్థిక, ఆర్థికేతర సర్వీసుల విభాగాల కింద విభజన ఆర్థిక సేవల విభాగానికి గ్రూప్ సీఈవోగా అమితాబ్ చతుర్వేది హైదదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలపై కఠిన చర్యలు ఎదుర్కొంటున్న కార్వీ గ్రూప్ .. తాజాగా వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టింది. ఆర్థిక సర్వీసులు, ఆర్థికేతర సర్వీసుల కింద రెండు విభాగాలుగా వ్యాపారాన్ని విభజించే ప్రక్రియ ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. తద్వారా గవర్నెన్స్‌ను, వ్యాపార నిర్వహణను మెరుగుపర్చుకోనున్నట్లు తెలిపింది. పునర్‌వ్యవస్థీకరణ

Most from this category