News


ఎర్నింగ్‌ డౌన్‌గ్రేడ్‌ అవకాశాలు ఎక్కువ!

Tuesday 18th February 2020
news_main1582017144.png-31899

2020-21పై మోతీలాల్‌ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌
నిఫ్టీ కంపెనీలకు సంబంధించి హైఫ్రీక్వెన్సీ డేటా ఇండికేటర్లు భారీ రికవరీ సూచించడం లేదని, అందువల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎర్నింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ రిసెర్చ్‌ హెడ్‌ గౌతమ్‌ దుగ్గడ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత క్యు3లో ఫలితాలు ఫర్వాలేదనిపించాయన్నారు. ఎర్నింగ్స్‌ నాణ్యతలో భారీ మెరుగుదల లేదని, స్వల్ప మెరుగుదల మాత్రమే ఉందని చెప్పారు. ఎర్నింగ్స్‌గ్రోత్‌ పుంజుకోవడానికి ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ, కన్జూమర్‌ విభాగాలు ముఖ్యపాత్ర పోషించగా, మెటల్స్‌, కమోడిటీ రంగాలు ఎర్నింగ్స్‌ గ్రోత్‌పై ప్రతికూల ప్రభావం చూపాయన్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ మినహాయిస్తే నిఫ్టీ ఎర్నింగ్స్‌లో ఎలాంటి మార్పులేదని గుర్తు చేశారు. అయితే గత మూడునాలుగేళ్లతో పోలిస్తే కమోడిటీ ఇతర రంగాలు మంచి రిజల్టే చూపినట్లన్నారు. అటో, సిమెంట్‌, క్యాపిటల్‌గూడ్స్‌ రంగాలు సైతం అంచనాలకు అనుగుణమైన ఫలితాలు చూపలేదని గౌతమ్‌ తెలిపారు. 
ఇప్పటికీ ఎకానమీలో సూక్ష్మ వాతావరణం బలహీనంగానే ఉందని, పలు ఇండికేటర్లు ఇంకా రికవరీ సంకేతాలేమీ ఇవ్వడం లేదని తెలిపారు. ఒకపక్క పరిమిత ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఉండగా మరోపక్క నిఫ్టీ ఈపీఎస్‌ అధికంగా ఉందని చెప్పారు. వీటిని పరిశీలిస్తే నిఫ్టీలో మరింత్‌ అప్‌మూవ్‌ పరిమితంగానే ఉంటుందని అంచనా వేశారు. మెటల్‌, చమురు మరియు గ్యాస్‌; యుటిలిటీలు, రియల్టీ, నిర్మాణం, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలకు దూరంగా ఉండాలని, ప్రైవేట్‌ బ్యాంకులు, ఐటీ, కన్జూమర్‌రంగాలపై పాజిటివ్‌గా ఉన్నామని మూడేళ్లుగా చెబుతున్నట్లు గుర్తు చేశారు. ఐటీ ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉందన్నారు. కన్జూమర్‌ రంగంలో హెచయూఎల్‌; టైటాన్‌, పిడిలైట్‌, బ్రిటానియా షేర్లపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌, ట్రెంట్‌ లాంటి కొన్ని కంపెనీలు ఈ దఫా అత్యద్భుత ఫలితాలు ఇచ్చాయని, ఇలాంటివి సైతం పరిశీలించవచ్చని చెప్పారు. దీంతో పాటు ప్రైవేట్‌ బ్యాంకులే ఇప్పటికీ నమ్మదగినవిగా ఉన్నాయన్నారు. 5- 5.5 శాతం జీడీపీ రేంజ్‌లో ఎకానమీ ఉన్నంత వరకు ఎర్నింగ్స్‌ బాగుపడతాయనే అంచనాకు రాలేమని, అందువల్ల ఇందుకుతగ్గట్లే పోర్టుఫోలియో నిర్మించుకోవాలని సూచించారు. 



You may be interested

మంచి షేర్లు ఖరీదే..కానీ పెట్టుబడులు వాటిలోకే!

Tuesday 18th February 2020

ఆర్థిక వ్యవస్థతో మార్కెట్లు డిస్కనెక్ట్‌ లార్జ్‌క్యాప్స్‌లోనే అధిక పెట్టుబడులు - మనీషి రాయ్‌చౌధురి, బీఎన్‌పీ పరిబాస్‌ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ స్టాక్‌ మార్కెట్లు ఎందుకు పురోగమిస్తున్నాయన్న ప్రశ్నకు.. డిస్కనెక్ట్‌ కావడమే కారణమంటున్నారు మనీషి రాయ్‌చౌధురి. బీఎన్‌పీ పరిబాస్‌లో ఏషియా పసిఫిక్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ అయిన రాయ్‌ లార్జ్‌ క్యాప్స్‌లోకే ఇకపైన కూడా పెట్టుబడులు ప్రవహించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో రాయ్‌ వెలిబుచ్చిన పలు అభిప్రాయాలను చూద్దాం.. దేశ ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌

మార్కెట్‌ ఒడిదుడుకులు పెరుగుతాయ్‌!

Tuesday 18th February 2020

గతవారం స్వల్ప హెచ్చుతగ్గులకు లోనై, స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ముగిసినప్పటికీ, కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రతరమైతే సమీప భవిష్యత్తులో మార్కెట్లు క్షీణిస్తాయని, మార్కెట్‌ విశ్లేషకులు జిమిత్‌ మోడీ వారాంతపు తన కాలమ్‌లో వ్యాఖ్యానించారు.  పార్టమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌,  ఆర్‌బీఐ ద్రవ్యవిధాన సమీక్ష తర్వాత మార్కెట్లో వచ్చిన పెనుతుఫాను తర్వాత ఇప్పుడు కొంత ప్రశాంతత నెలకొంది.  దీంతో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ధైర్యంగా కొనుగోళ్లు చేపట్టారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.59

Most from this category