News


పోగొట్టుకున్న ఫోన్లను .. కనిపెట్టేందుకు పోర్టల్‌

Tuesday 31st December 2019
Markets_main1577762392.png-30540

- ఢిల్లీ వాసుల కోసం వెబ్‌సైట్ ప్రారంభం
- త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి

న్యూఢిల్లీ: చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీ దొరకపుచ్చుకునేందుకు, బ్లాక్ చేసేందుకు ఉపయోగపడే విధంగా కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) వాసుల కోసం www.ceir.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని సుమారు 5 కోట్ల మంది మొబైల్ సబ్‌స్క్రయిబర్స్‌కు ఇది ఉపయోగకరంగా ఉండగలదని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ తెలిపారు. సెప్టెంబర్‌లోనే ముంబైలో ఆవిష్కరించిన ఈ పోర్టల్‌ను త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత .. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు సంబంధించి పోలీసులకు చేసిన ఫిర్యాదు కాపీ, సొంత గుర్తింపు ధృవీకరణ పత్రం మొదలైన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా సదరు మొబైల్‌ను బ్లాక్‌ చేస్తారు. ఒకవేళ ఆ మొబైల్‌ను ఎవరైనా ఉపయోగించిన పక్షంలో టవర్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసి, డివైజ్‌ను రికవర్ చేస్తారు. బ్లాక్‌ చేసిన తర్వాత ఫోన్‌ను విక్రయించడానికి కుదరదని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. 



You may be interested

అక్టోబర్‌లోనూ కొనసాగిన జియో జోరు

Tuesday 31st December 2019

- 91 లక్షల నూతన చందాదారులు న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో.. సబ్‌స్క్రైబర్ల సంఖ్యను  గణనీయంగా పెంచుకుంటోంది. అనతికాలంలోనే భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కు నెట్టి రెండో స్థాన్నాన్ని కైవసం చేసుకున్న ఈ సంస్థ.. అదే జోరును కొనసాగిస్తూ, వాయు వేగంతో దూసుకుపోతోంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్‌లో నూతనంగా 91 లక్షల చందాదారులు జతకావడంతో సంస్థ మొత్తం

ర్యాలీ ఉంటుంది కానీ..

Tuesday 31st December 2019

2020లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ర్యాలీ ఉంటుందని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది దేశ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణపైనే ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   ‘‘ఏదైనా రికవరీ ఉంటే అది ఎక్కువగా 2020 రెండో భాగం (జూన్‌ తర్వాత)లోనే. మొదటి భాగంలో లార్జ్‌క్యాప్స్‌ మంచి పనితీరు కొనసాగుతుంది. జీడీపీ వృద్ధి గణాంకాల ఆధారంగా మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌లోకి అడుగు పెట్టాలా లేదా అన్నది నిర్ణయించుకోవాలి’’ అని జేఎం ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషనల్‌

Most from this category