బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఆమోదం
By Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీనానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఆర్థిక సేవల విభాగం ఒక లేఖ రాసిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తమకు కూడా ఆర్థిక సేవల విభాగం నుంచి లేఖ అందిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బ్యాంక్‌ల విలీనం కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సంఖ్య 12కు తగ్గింది. 2017లో ఈ బ్యాంక్‌ల సంఖ్య 27గా ఉంది.
You may be interested
ఐడియా పేమెంట్స్ బ్యాంక్ మూసివేత
Tuesday 19th November 20192015లో లైసెన్స్ 2018లో కార్యకలాపాలు మొదలు ఈ ఏడాది జూలైలో స్వచ్ఛందంగా మూసివేత ముంబై: మరో పేమెంట్స్ బ్యాంక్ మూసివేత ఖరారైంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లిక్విడేషన్‌కు తాజాగా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద మూసివేత కోసం ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హై కోర్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 18న ఆదేశాలు జారీ చేసిందని ఆర్బీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా
ఫార్మా వృద్ధిపై యూఎస్ఎఫ్డీఏ ప్రభావం
Tuesday 19th November 2019తనిఖీల వల్లే ప్రస్తుత పరిస్థితి డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్ ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:- దేశీయ ఫార్మా కంపెనీల ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తరచూ తనిఖీలు చేయడం, లోపాలను లేవనెత్తడంతో ఔషధ ఎగుమతుల వృద్ధి తగ్గుతోందని సీఐఐ ఫార్మాస్యూటికల్స్ నేషనల్ కమిటీ చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్ జి.వి.ప్రసాద్ అన్నారు. సీఐఐ-ఐఎంటీహెచ్ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన హెల్త్, ఫార్మా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వార్నింగ్ లెటర్ల కారణంగా చాలా కంపెనీల అనుమతులు