పీఎన్బీ మొండిబకాయిల వసూళ్లు రెట్టింపు
By Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మొండిబకాయిల (ఎన్పీఏ) రికవరీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపయ్యింది. ఈ మొత్తం రూ.20,000 కోట్లు. 2017-18తో పోల్చితే (రూ.9,666 కోట్లు) ఈ మొత్తం దాదాపు రెట్టింపు. బ్యాంక్ వార్షిక నివేదికలో చైర్మన్ సునిల్ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆభరణాల వర్తకులు నీరవ్‌మోదీ, చోక్సీ కొందరు ఉద్యోగులు కుమ్మక్కై చేసిన దాదాపు రూ.11,000 కోట్ల కుంభకోణం 2018 ఫిబ్రవరిలో బ్యాంక్‌ను కుదిపేయటం తెలిసిందే. ‘‘అటు తీవ్రత దృష్ట్యా, ఇటు పరిమాణం దృష్ట్యా ఏర్పడిన తీవ్ర సంక్షోభ పరిస్థితులను అధిగమించి, పురోగమించాల్సిన అవసరం బ్యాంక్ ముందు ఉంది’’ అని నివేదిక వివరించింది. ఇంతటి తీవ్ర పరిస్థితులున్నప్పటికీ బ్యాంక్ తన నికర నష్టాలను తగ్గించుకోగలిగిందని పేర్కొంది. 2017-18లో రూ.12,283 కోట్లుగా ఉన్న నికర నష్టాల పరిమాణం 2018-19లో రూ.9,975 కోట్లకు తగ్గిందని నివేదిక వివరించింది. వ్యాపార పరిమాణం కూడా వార్షికంగా 11.1 శాతం వృద్ధితో రూ.11.45 లక్షల కోట్లకు చేరిందని వివరించింది. బ్యాంకుపై కస్టమర్ల చెక్కుచెదరని విశ్వాసాన్ని ఈ వ్యాపార గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది.
You may be interested
ఐటీ షేర్లకు హెచ్ 1 వీసా కష్టాలు
Thursday 20th June 2019హెచ్1బీ వీసాలపై జారీని మరింత పరిమితం చేసేందుకు అమెరికా యోచిస్తుందనే వార్తలు వెలుగులోకి రావడంతో గురువారం ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్ఎస్ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ నేటి ట్రేడింగ్‌లో 2శాతం నష్టపోయింది. భారత్ స్థానికంగా డాటా నిల్వలు చేసుకునే విదేశీ కంపెనీలపై పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తుందని అమెరికా ఆరోపించింది. డాటా నియమాలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో అమెరికా హెచ్1బీ వీసాల జారీలపై పరిమితులను
హైదరాబాద్‌లో అమెజాన్ భారీ డెలివరీ స్టేషన్
Thursday 20th June 2019హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అతిపెద్ద డెలివరీ స్టేషన్‌ను బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలో నెలకొల్పిన ఈ కేంద్రం ద్వారా రంగారెడ్డి జిల్లాలోని కస్టమర్లకు వేగంగా ఉత్పత్తులను డెలివరీ చేయడానికి వీలవుతుందని కంపెనీ తెలిపింది. తెలంగాణలో మొత్తం 90 డెలివరీ స్టేషన్లున్నాయని, వీటిలో ఒక్క హైదరాబాద్‌లో 12 విస్తరించాయని అమెజాన్ ఇండియా లాస్ట్ మైల్ ట్రాన్స్‌పోర్టేషన్ డైరెక్టర్ ప్రకాశ్ రోచ్లానీ ఈ