News


పీఎన్‌బీ లాభం రూ. 507 కోట్లు..షేరు 5 శాతం డౌన్‌

Tuesday 5th November 2019
news_main1572947306.png-29369

ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు నిరాశపరిచాయి. ఈ క్యూ2లో బ్యాంక్‌ రూ.507.05 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం 11శాతం వృద్ధితో రూ.15,556.61 కోట్లను నమోదు చేసింది. గతేడాది క్యూ2లో మొత్తం ఆదాయం రూ.14,035.88 కోట్లుగా ఉంది. ఇదే త్రైమాసికంలో రూ.4,262 నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.3,974 కోట్ల పోలిస్తే ఇది 7.2శాతం అధికం.మొండిబకాయిలకు రూ.2,928.90 కోట్ల ప్రొవిజన్లను కేటాయించింది. ఇదే ఏడాది క్యూ1లో రూ.2,023.31 కోట్లను మాత్రమే కేటాయించింది. గతేడాది క్యూ2లో కేటాయించిన రూ.9,757.90 కోట్లతో పోలిస్తే 70శాతం తక్కువ. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్‌పీఏలు 16.76శాతానికి , నికర ఎన్‌పీఏలు 7.65శాతానికి పెరిగాయి.  ఫలితాలు మార్కెట్‌ అంచనాల్ని అందుకోలేకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం ఫలితాల ప్రకటన తర్వాత ఈ షేరు 5 శాతం పతనమై రూ. 65 దిగువకు తగ్గింది. 

క్యూ2 ఫలితాలు నిరాశపరచడంతో బ్యాంకు షేరు బీఎస్‌ఈలో మధ్యాహ్నం గం.3:15ని.లకు 5.50శాతం నష్టంతో రూ.65.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

సెన్సెక్స్‌ చార్టులో ‘‘గోల్డెన్‌ క్రాస్‌’’

Tuesday 5th November 2019

బుల్లిష్‌నెస్‌కు సంకేతం డైలీ చార్టుల్లో అక్టోబర్‌ 30న సెన్సెక్స్‌ గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పరిచింది. చార్టుల్లో ఇలాంటి క్రాసోవర్‌ ఏర్పడడం బుల్‌ర్యాలీ కొనసాగింపునకు సంకేతంగా నిపుణులు చెబుతుంటారు. స్వల్పకాలిక ట్రెండ్‌ ఇండికేటర్‌ దీర్ఘకాలిక ట్రెండ్‌ ఇండికేటర్‌ను క్రాసోవర్‌ చేయడాన్ని గోల్డెన్‌క్రాస్‌గా చెబుతారు. ముఖ్యంగా 40 రోజుల డీఎంఏ ఇండికేటర్‌ 200 రోజుల డీఎంఏ ఇండికేటర్‌ను పైవైపుగా ఖండిస్తూపోతే గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడినట్లు పరిగణిస్తారు. ఇది ఒక బలమైన బుల్లిష్‌ ఇండికేటర్‌గా నిపుణులు భావిస్తుంటారు.

ఈ-పాన్‌ ఇక సులభం

Tuesday 5th November 2019

ఆధార్‌ కార్డు డేటా బేస్‌లోని సమాచారాన్ని వినియోగించుకోని, ఆన్‌లైన్‌లో పాన్‌ కార్డును జారీ చేసేందుకు ఆదాయపన్ను శాఖ సిద్ధమవుతుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. వచ్చే కొన్ని వారాలలో  ఎలక్ట్రానిక్‌ పాన్‌(ఈ-పాన్‌) సౌకర్యాన్ని ప్రారంభించాలని ఆదాయ శాఖ ప్రణాళికలు వేస్తోందని, ఇప్పటికే గత ఎనిమిది రోజులలో 62,000 ఈ-పాన్‌లను పైలేట్‌ ప్రాజెక్ట్‌గా జారీ చేసిందని ఈ పత్రిక తెలిపింది. ‘రియల్‌ టైంకు చేరువలో’ భాగంగా ఈ సేవలను ఉచితంగా అందుబాటులోకి

Most from this category