News


'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి'గా నీరవ్ మోదీ

Friday 6th December 2019
news_main1575602957.png-30082

  • ప్రకటించిన ముంబై కోర్టు
  • ఆస్తుల జప్తునకు మార్గం సుగమం

ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కి దాదాపు 2 బిలియన్ డాలర్ల టోకరా వేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీని 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి'గా (ఎఫ్‌ఈవో) ముంబై కోర్టు ప్రకటించింది. ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్ధనతో ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది. దీంతో మోదీ ఆస్తుల జప్తునకు మార్గం సుగమమైంది. 2018లో ఎఫ్‌ఈవో చట్టం వచ్చిన తర్వాత.. వ్యాపారవేత్త విజయ్ మాల్యా తర్వాత పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి ముద్ర పడినది నీరవ్ మోదీకే.     రూ. 100 కోట్ల పైగా మోసాలకు పాల్పడి, వేరే దేశానికి పారిపోయి.. తిరిగి రాకుండా తప్పించుకుంటున్న వారిని ఎఫ్‌ఈవో చట్టం కింద పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులుగా ప్రకటించవచ్చు. 


    పీఎన్‌బీ కుంభకోణంలో నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. స్కామ్ వెలుగులోకి రావడానికి ముందుగానే 2018 జనవరిలో వారు దేశం విడిచి వెళ్లిపోయారు. 2019 మార్చిలో లండన్‌లో నీరవ్ మోదీ అరెస్టయ్యారు. ప్రస్తుతం తనను భారత్ తెప్పించే ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటిదాకా మోదీకి చెందిన సుమారు రూ. 1,396 కోట్ల విలువ చేసే ఆస్తులను లాంఛనంగా ఈడీ అటాచ్ చేసింది. You may be interested

ఆర్‌బీఐకి సీఐసీ షోకాజ్ నోటీసు

Friday 6th December 2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కేసులో విచారణకు హాజరు కానందుకే న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తనిఖీ నివేదికల వెల్లడి వివాదానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కి కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై విచారణకు హాజరు కావాలన్న తమ ఆదేశాలను ఆర్‌బీఐ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) తేలిగ్గా తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఉల్లంఘించినందున .. సమాచార హక్కు (ఆర్‌టీఐ)

మైనింగ్‌కు అది వర్తించదు

Friday 6th December 2019

15 శాతం కార్పొరేట్ ట్యాక్స్‌పై ఆర్థిక మంత్రి స్పష్టీకరణ న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్‌ విధించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌, మైనింగ్‌, పుస్తకాల ముద్రణకు ఇది వర్తించదని పేర్కొన్నారు. ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు 2019 ప్రకారం నెగటివ్ లిస్టులో ఇవి ఉన్నట్లు గురువారం రాజ్యసభకు ఆమె తెలిపారు. వీటిని తయారీ

Most from this category