News


హెచ్‌డీఐఎల్‌ ఎక్స్‌పోజరే ముంచింది!

Monday 30th September 2019
news_main1569815174.png-28611

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సంక్షోభానికి... రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు బ్యాంకు భారీగా రుణాలను సమర్పించుకోవడమేనని వెల్లడైంది. పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ ఆస్తులు రూ.8,800 కోట్లు కాగా, ఇందులో రూ.6,500 కోట్లకు పైగా ఒక్క హెచ్‌డీఐఎల్‌కే ఇవ్వడం జరిగినట్టు సస్పెండైన బ్యాంకు ఎండీ జాయ్‌థామస్‌ అంగీకరించినట్టు సమాచారం. అంటే రుణ ఆస్తుల్లో 73 శాతాన్ని ఒకే ఖాతాకు బ్యాంకు ఎలా ఇచ్చిందన్నది పెద్ద ప్రశ్న. ఆర్‌బీఐ నిబంధనలకు వ్యతిరేకం ఇది. ఆర్‌బీఐ నిర్దేశించిన పరిమితి కంటే నాలుగు రెట్లు ఎక్కువ.  
ముందే ఆదేశించినా జరగలేదు
పీఎంసీ బ్యాంకు చైర్మన్‌ వర్యమ్‌సింగ్‌ను గతేడాదే తొలగించాలని, మహారాష్ట్ర రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌కు ఆర్‌బీఐ సూచించింది. కోపరేటివ్‌ బ్యాంకులపై పరిపాలనా నియంత్రణ ఈ సంస్థకే ఉంటుది. కానీ, ఇది ఆచరణకు నోచుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌డీఐఎల్‌కు రుణాల మంజూరీలో చైర్మన్‌ పాత్రను గుర్తించి ఈ సిఫారసు చేసింది. కానీ, బ్యాంకు చైర్మన్‌గా సింగ్‌ ఇటీవలి కాలం వరకు కొనసాగారు. 



You may be interested

వచ్చే ఏడాది కాలంలో నిఫ్టీపై రిటర్న్‌ 20 శాతం!

Monday 30th September 2019

‘నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాకులు ఫ్రంట్‌ లైన్‌(బ్లూచిప్‌ స్టాకులు) స్టాకులను మించి ప్రదర్శన చేయాలంటే మరికొన్ని ఆర్థిక చర్యలవసరం. ప్రస్తుతం నిఫ్టీ కన్సాలిడేషన్‌ దశలో ఉంది. వచ్చే ఏడాది కాలంలో నిఫ్టీ 20 శాతం రిటర్న్‌ల్ని ఇస్తుందని అంచనా వేస్తున్నాం’ అని కోటక్ సెక్యూరిటీస్ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. గరిష్ఠ

4న మరో దఫా రేటు కోత?

Monday 30th September 2019

విశ్లేషకుల అభిప్రాయం ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ అక్టోబర్‌ 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయాన్ని ప్రకటించనుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు

Most from this category