News


పీఎంసీ బ్యాంక్‌లో నగదు ఉపసంహరణ పరిమితి పెంపు

Wednesday 6th November 2019
news_main1573012435.png-29384

  • రూ. 50,000 వరకు అనుమతి

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌ (పీఎంసీ) డిపాజిటర్లకు మరింత ఊరట లభించింది. ఒక్కో ఖాతా నుంచి గరిష్ట నగదున ఉపసంహరణ పరిమితి రూ. 50,000 వరకు పెంచినట్లు ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది. అంతక్రితం ఈ పరిమితి రూ. 40,000గా ఉండగా.. తాజాగా మరో రూ. 10,000 పరిమితి పెంచింది. రుణాల విషయంలో బ్యాంక్‌ యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందని తేలిన నేపథ్యంలో ఆ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలను అమలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 23న ఈ విషయాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ.. తొలుత ఒక్కో ఖాతా నుంచి రూ. 1,000 ఉపసంహరణకే అనుమతించింది. ఆ తరువాత, తాజా ప్రకటనతో కలుపుకుని నాలుగు విడతలుగా పరిమితిని పెంచింది. ద్రవ్య లభ్యత అంశాన్ని పరిగణలోనికి తీసుకుని ఎప్పటికప్పుడు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నామని, ఈ క్రమంలోనే రూ. 50,000 పరిమితి పెంపు అనుమతి ఇచ్చినట్లు వివరించింది. డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం బ్యాంక్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ప్రకటించింది. 



You may be interested

బలపడిన రూపీ!

Wednesday 6th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం సెషన్‌లో 10 పైసలు బలహీనపడి 70.79 వద్ద ప్రారంభమైంది. కాగా విదేశీ నిధుల ఇన్‌ఫ్లో పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో స్వల్పంగా లాభపడి 70.69 వద్ద గత ఐదు వారాల గరిష్ఠానికి చేరుకుంది. యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే పెరగడంతో చమురు ధరలు బుధవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కానీ యుఎస్‌-చైనా వాణిజ్య ఒత్తిళ్లు సరళతరమవ్వడంతో ఈ

నష్టాలతో ప్రారంభం

Wednesday 6th November 2019

 ఏడు రోజుల ర్యాలీకి క్రితం రోజు బ్రేక్‌వేసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం సైతం నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 110 పాయింట్ల నష్టంతో 40,140 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 11,900 పాయింట్ల దిగువన 11,889 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

Most from this category