News


ఎకానమీ ప్రగతికి ఏం చేద్దాం..?

Tuesday 7th January 2020
news_main1578368136.png-30716

  • కార్పొరేట్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ
  • ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చ

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎల్అ౾ండ్‌టీ అధినేత ఏఎం నాయక్‌ మొదలైన వారు దీనికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కార్పొరేట్లతో ప్రధాని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

సవాళ్లతో సమరం...
డిమాండ్ మందగించడం, తయారీ రంగం బలహీనపడటం తదితర అంశాల కారణంగా జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరింత నెమ్మదించి.. ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయింది. మొండిబాకీల భారంతో కుంగుతున్న ఆర్థిక రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కూడా వృద్ధికి ప్రతికూలంగా ఉంటున్నాయి. వృద్ధికి ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను గతేడాది గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాంకులకు మరింత మూలధన నిధులివ్వడం, పలు బ్యాంకులను విలీనం చేయడంతో పాటు కార్పొరేట్ ట్యాక్స్‌ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం వంటి సంస్కరణలు ప్రవేశపెట్టింది. అయితే, ఇవేవీ కూడా బలహీనపడిన వినియోగ డిమాండ్‌ను నేరుగా పెంచేందుకు దోహపడేవి కావనే విమర్శలు ఉన్నాయి. దీంతో వృద్ధికి ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యల గురించి తెలుసుకునేందుకు ఇటీవలి కాలంలో వివిధ రంగాలకు చెందిన 60 మంది పైగా వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్‌ కసరత్తులో భాగంగా పరిశ్రమవర్గాలతో సమావేశమవుతున్నారు. దీంతో రాబోయే బడ్జెట్‌లో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. 



You may be interested

ఫ్లిప్‌కార్ట్‌కు ఓటీపీ అవసరం లేదు..

Tuesday 7th January 2020

రూ. 2,000 వరకు పరిమితి వీసా సేఫ్‌ క్లిక్‌ పేరిట సేవలు న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. తాజాగా వన్‌ టైమ్‌ పాస్‌వార్డ్‌ (ఓటీపీ) అవసరం లేని చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్న మొత్తాల్లో కొనుగోలు చేసేవారి చెల్లింపులను సులభతరం చేయడంలో భాగంగా.. ‘వీసా సేఫ్‌ క్లిక్‌’ పేరిట సేవలను ప్రారంభించినట్లు సోమవారం ప్రకటించింది. రూ. 2,000 వరకు పూర్తి భద్రతతో ఓటీపీ లేకుండా ఈ విధానంలో చెల్లించవచ్చని ఫ్లిప్‌కార్ట్ హెడ్

‘నానో’కు.. టాటా గుడ్‌బై

Tuesday 7th January 2020

2019లో ఒక్కటీ ఉత్పత్తి చేయలేదన్న కంపెనీ న్యూఢిల్లీ: లక్ష రూపాయలకే అంటూ మార్కెట్లోకి వచ్చిన రతన్‌ టాటా కలల కారు... ప్రజల కారు.. ‘నానో’ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది ఒక్క నానో కూడా ఉత్పత్తి చేయలేదని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ‘2019లో జీరో ప్రొడక్షన్‌’ అంటూ.. నానో ఉత్పత్తిపై ఎక్సే‍్ఛంజీలకు కంపెనీ సోమవారం సమాచారమిచ్చింది. కాకపోతే అంతకు ముందటేడాది ఉత్పత్తి చేసిన ఒక కారును 2019 ఫిబ్రవరిలో విక్రయించామని మాత్రం

Most from this category