News


ఇంధన రంగ సీఈవోలతో మోదీ

Monday 23rd September 2019
news_main1569211293.png-28481

హూస్టన్‌: అమెరికాకు చెందిన చమురు, సహజ వాయువు రంగ కంపెనీల సీఈవోలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంపై వారితో చర్చించారు. ఇంధన భద్రత, భారత్‌-యూఎస్‌ మధ్య పరస్పర పెట్టుబడి అవకాశాల పెంపుపై మాట్లాడారు. ‘ఎనర్జీ రంగంలోని ప్రముఖ సంస్థల సీఈవోలతో సమావేశం అద్భుతంగా సాగింది. హూస్టన్‌కు వచ్చి ఇంధనం గురించి మాట్లాడకుండా ఉండడం అసాధ్యం. ఈ రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకునే పద్ధతులపై చర్చించాం’ అంటూ సమావేశం అనంతరం ప్రధాని ట్వీట్‌ చేశారు. మొత్తం 17 సంస్థల సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  కాగా, భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ, సంస్కరణకు తీసుకున్న చర్యలు, కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు నిర్ణయాన్ని సీఈవోలు ఈ సందర్భంగా స్వాగతించారని విదేశాంగ శాఖ ప్రతినిధులు తెలిపారు. భారత్‌లో తమ కార్యకలాపాలను పెంచుతామని చెప్పిన సీఈవోలు, ఈ రంగంలో సడలింపులను కొనియాడారని చెప్పారు. 

పెట్రోనెట్‌ పెట్టుబడులు ...
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యూఎస్‌ సంస్థ టెల్లూరియన్‌తో భారత్‌కు చెందిన పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ ఒప్పందం చేసుకుంది. టెల్లూరియన్‌ ఏర్పాటు చేస్తున్న ప్రతిపాదిత డ్రిఫ్ట్‌వుడ్‌ ఎల్‌ఎన్‌జీ ఎక్స్‌పోర్ట్‌ టెర్మినల్‌లో 20 శాతం ఈక్విటీ కింద రూ.17,800 కోట్లు పెట్రోనెట్‌ పెట్టుబడి చేస్తుంది. డీల్‌లో భాగంగా 40 ఏళ్లపైగా ఏటా 50 లక్షల మెట్రిక్‌ టన్నుల లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ను (ఎల్‌ఎన్‌జీ) యూఎస్‌ నుంచి పెట్రోనెట్‌ దిగుమతి చేసుకుంటుంది. 



You may be interested

పెరిగిన ‘సోనాలికా’ మార్కెట్‌ వాటా

Monday 23rd September 2019

ఆగస్టులో 0.8% వృద్ధితో 14.7 శాతానికి చేరిక ఏప్రిల్‌-ఆగస్టులో మొదటి స్థానానికి ఎగుమతులు న్యూఢిల్లీ: ప్రముఖ ట్రాక్టర్ల తయారీ కంపెనీ ‘సొనాలికా’ మార్కెట్‌ వాటా ఈ ఏడాది ఆగస్టులో 0.8 శాతం వృద్ధి రేటును నమోదుచేసింది. గతనెల్లో 14.7 శాతానికి చేరుకుంది. దేశీ ఆటో రంగం మందగమనంలో నడుస్తున్నప్పటికీ.. తమ బ్రాండ్‌ మాత్రం వేగంగా దూసుకుపోతుందని ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ (ఐటీఎల్‌) ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఏప్రిల్‌-ఆగస్టు కాలంలో తమ ఎగుమతులు మొదటి

10 పైసలు నష్టంతో ప్రారంభమైన రూపీ

Monday 23rd September 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం 10 పైసలు బలహీనపడి 71.04 వద్ద ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 40 బలపడి 70.94 వద్ద ముగిసింది. దీనితోపాటు దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు గత సెషన్‌లో భారీగా లాభపడడం కూడా రూపీకి కలిసివచ్చింది. కానీ ట్యాక్స్‌ తగ్గిం‍పు బాండ్‌ మార్కెట్‌లో తీవ్రమైన ప్రభావాన్ని చూపకపోవడం గమనార్హం. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో

Most from this category