News


కిర్గిజ్‌తో పెట్టుబడుల ఒప్పందానికి తుదిరూపు

Saturday 15th June 2019
news_main1560575159.png-26315

  • ద్వైపాక్షిక వాణిజ్యం పెంపునకు ప్రణాళిక
  • ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి

బిష్కెక్‌: కిర్గిజిస్తాన్‌, భారత్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంుచుకోవడానికి ఇరు దేశాలు అయిదేళ్ల మార్గదర్శ ప్రణాళికలను రూపొందించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే, ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ), ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందానికి తుది రూపు కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. భారత్‌- కిర్గిజ్‌ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. భారత్‌, కిర్గిజిస్థాన్‌ దేశాల్లో వివిధ రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఇరు దేశాల వ్యాపార వర్గాలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. "ప్రపంచ ఎకానమీ వేగంగా మారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవాలి" అని ప్రధాని చెప్పారు. కిర్గిజిస్తాన్‌లో టెక్స్‌టైల్స్‌, రైల్వేస్‌, జల విద్యుత్‌, మైనింగ్‌, ఖనిజాన్వేషణ తదితర రంగాల్లో భారత వ్యాపారవేత్తలకు అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కిర్గిజ్‌ వ్యాపారవేత్తలు కూడా భారత్‌ సందర్శించి, పెట్టుబడుల అవకాశాలు పరిశీలించాలని మోదీ సూచించారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు కిర్గిజ్‌లో పర్యటిస్తున్న సందర్భంగా మోదీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు దేశాల్లోకి పెట్టుబడుల రాకకు తోడ్పడటంతో పాటు ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు కూడా కిర్గిజ్‌, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక ఒడంబడిక ఉపయోగపడగలదని ప్రధాని చెప్పారు. 



You may be interested

ఎన్‌డీటీవీ ప్రణయ్‌రాయ్‌పై సెబీ నిషేధం

Saturday 15th June 2019

ఆయన భార్యపై కూడా  నిషేధం రెండేళ్లపాటు  న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ ప్రణయ్‌ రాయ్‌పై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నిషేధం విధించింది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లైన ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌, హోల్డింగ్‌ కంపెనీలు రెండేళ్ల పాటు క్యాపిటల్‌ మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సెబీ నిషేధించింది. ఈ రెండేళ్లలో ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌లు బోర్డ్‌ పదవితో పాటు ఎలాంటి ఉన్నతోద్యోగాలు చేపట్టరాదని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా

రూపాయి 30 పైసలు డౌన్‌

Saturday 15th June 2019

69.80కి పతనం ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 30 పైసలు పడిపోయింది. 69.80 వద్ద ముగిసింది. గురువారం రూపాయి ముగింపు 69.50. ఒమన్‌ గల్ఫ్‌లో రెండు ఆయిల్‌ ట్యాంకర్లపై దాడులు... తత్ఫలితంగా సరఫరాల్లో సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలు... దీనితో అంతర్జాతీయ మార్కెట్‌లో  క్రూడ్‌ ధరల తీవ్రత రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్‌ మారకంలో ఆసియా దేశాల కరెన్సీ విలువల పతనం, దేశీయ

Most from this category