News


తనఖా షేర్ల పరిష్కారమే ‘జీ’ రికవరీకి కీలకం

Saturday 19th October 2019
news_main1571474496.png-29007

ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్ల అంశానికి సంబంధించి సరైన పరిష్కారం దొరకడమే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లలో రికవరీకి కీలకమని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్యు2లో కంపెనీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోడంతో పలు బ్రోకరేజ్‌లు షేరు రేటింగ్‌, టార్గెట్‌ ధరలను తగ్గించారు. కంపెనీకి రావాల్సిన మొత్తాలు పేరుకుపోతుండడం, ఇది క్రమంగా ఆపరేటింగ్‌ నగదు ప్రవాహంపై నెగిటివ్‌ ప్రభావం చూపడం.. మరింత ఆందోళనపరిచే అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంపెనీ రుణ సమస్య పూర్తిగా తీరి, భవిష్యత్‌ ఓనర్ల విషయమై స్పష్టత వచ్చేంతవరకు స్టాకు ఒడిదుడకులకు లోనైతూనే ఉంటుందని మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. కంపెనీ ఫలితాలు పర్వాలేదనుకున్నా, నగదు ప్రవాహం, బాలెన్స్‌షీట్‌పై ఆందోళనలు కొనసాగుతున్నాయని క్రెడిట్‌ సూసీ పేర్కొంది. ప్రమోటర్లు కంపెనీ ఓనర్‌షిప్‌ కోల్పోతే, అది కంపెనీకి అత్యంత నెగిటివ్‌ అంశంగా మారవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ వ్యాఖ్యానించింది. కంపెనీ వాల్యూషన్ల పరంగా ఆకర్షణీయంగానే ఉన్నా, ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్ల భవితవ్యంపై స్పష్టత వస్తేనే షేరులో పురోగతి ఉంటుందని ఎడెల్‌వీజ్‌ తెలిపింది. 
బ్రోకరేజ్‌ల అంచనాలు..

  • మోర్గాన్‌స్టాన్లీ జీ షేరుకు అండర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇస్తూ టార్గెట్‌ ధరను రూ. 248గా నిర్ణయించింది.
  • బోఫాఎంఎల్‌ సంస్థ న్యూట్రల్‌ రేటింగ్‌ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ. 445 నుంచి రూ. 360కి తగ్గించింది.
  • క్రెడిట్‌ సూసీ సైతం న్యూట్రల్‌ రేటింగ్‌ కొనసాగిస్తూ రూ. 400 నుంచి రూ. 230కి టార్గెట్‌ను తగ్గించింది.
  • మాక్వ్యరీ సంస్థ న్యూట్రల్‌ రేటింగ్‌తో టార్గెట్‌ను రూ. 268గా నిర్ణయించింది. 
  • కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈపీఎస్‌ను 4-6 శాతం మేర తగ్గించింది.
  • అయితే సీఎల్‌ఎస్‌ఏ మాత్రం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టార్గెట్‌ ధరను రూ. 290 నుంచి రూ. 320కు పెంచింది.

ప్రస్తుతం స్టాకు తన చారిత్రక వాల్యూషన్ల కన్నా 60 శాతం డిస్కౌంట్‌లో ట్రేడవుతోంది. 



You may be interested

ఎర్నింగ్స్‌ వేళ ఏంచేయాలి?

Saturday 19th October 2019

మార్కెట్‌ నిపుణుల సలహాలు కంపెనీలు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇప్పటివరకు కంపెనీలు మిశ్రమ ఫలితాలు ప్రకటించాయి. ఈనేపథ్యంలో ఫలితాల సీజన్‌లో మార్కెట్‌లో ఎలా ప్రవర్తించాలో నిపుణులు సలహా ఇస్తున్నారు. ఫలితాలకు ముందు అంచనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దని, త్రైమాసిక ఫలితాలు స్వల్పకాలిక ట్రెండ్‌ను మాత్రమే ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.  - మీరు దీర్ఘకాలిక ఇన్వెస్టరైతే ఫలితాలకు ముందు ఒకస్టాకులో ప్రవేశించకుండా ఉండడం మంచిది. ఎర్నింగ్స్‌ ఎలా ఉంటాయో తెలియదు

దీపావళికి ముందే మరో బుల్‌రన్‌?!

Saturday 19th October 2019

పండుగ నాటికి పన్నెండు వేలకు నిఫ్టీ నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లో క్రమంగా సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఊపందుకుంటున్నాయి. పాజిటివ్‌ సెంటిమెంట్‌ పెరుగుతోంది. వరుసగా రెండో వారం కూడా వీఐఎక్స్‌ తరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఎఫ్‌పీఐలు షార్ట్‌ పొజిషన్లు కవర్‌ చేసి, స్పాట్‌లో కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇవన్నీ మార్కెట్‌పై బుల్స్‌ పట్టు మరింత పెరుగుతుందనేందుకు సంకేతాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనుకున్నదానికన్నా ముందే అంచనాలను అందుకోగలదని భావిస్తున్నారు. మార్కెట్లో రిస్కులు తీసుకునేందుకు

Most from this category